దుబాయ్ శేఖర్, పాస్ పోర్ట్ బ్రోకర్ బుద్ది మారలేదు – కేసీఆర్ పై డీకే అరుణ్ ఫైర్

-

కర్మకాలి తెలంగాణ కి సీఎం అయ్యాడని.. పాస్ పోర్ట్ బ్రోకర్ నుండి ఇంతకన్న ఎక్కువ ఏమి ఆశిస్తామని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ అన్నారు. దుబాయ్ శేఖర్ అని పిలవాలి… కెసిఆర్ చెట్టుకు కట్టేసి కొట్టిన విషయన్ని మర్చిపోయావా అని ఫైర్‌ అయ్యారు. లోపల ఉన్న దుబాయ్ శేఖర్, పాస్ పోర్ట్ బ్రోకర్ బుద్ది మారలేదు…కెసిఆర్ నీకు పోగాలం దాపురించిందని ఆగ్రహించారు.

దేవుళ్ళ మీద కూడా మాట్లాడుతావా… ఇంత దిగ జారుతావా అని నిలదీశారు. జోగులాంబ అమ్మవారిని అవమానించేలా మాట్లాడతవా .. నీకు ఒంటి నిండా అహంకారం పెరిగిపోయిందన్నారు బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ. కెసిఆర్ నువ్వొక డ్రామా మాస్టర్ వని.. రాష్ట్రం జీతాలు టైమ్ కు ఇవ్వని నువ్వు GDP గురుంచి మాట్లాడుతవా అని నిలదీశారు.

ముందమోపి వ్యవహారమ .. అంత అలుసా అని ఆగ్రహించారు. కెసిఆర్ నీ మొఖం, ని ముక్కును అద్దంలో చూసుకున్నావా అని… పియుష్ గోయల్ చుట్టూ తిరిగింది మీరు… చిల్లర నా కొడుకులు మీరు అని నిప్పులు చెరిగారు. తెలంగాణలో లుంగీలు కట్టుకుంటారు… అది దక్షిణాది కల్చర్.. అని తెలిపారు బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ.

Read more RELATED
Recommended to you

Latest news