మంచి తరుణం మించిన దొరకదు.. భారీగా తగ్గిన ఐఫోన్ల ధరలు..!

కొత్త ఐఫోన్లు విడుదల కాగానే ఆపిల్ సహజంగానే పాత ఐఫోన్ల ధరలను తగ్గిస్తుంటుంది. అందులో భాగంగానే గతేడాది విడుదలైన ఐఫోన్ Xఆర్ ఫోన్‌తోపాటు అంతకు ముందు ఏడాది విడుదలైన ఐఫోన్ 7, 7 ప్లస్, 8, 8ప్లస్ ఫోన్ల ధరలను ఆపిల్ భారీగా తగ్గించింది.

ప్రతి ఏటా సెప్టెంబర్ నెలలో సాఫ్ట్‌వేర్ సంస్థ ఆపిల్ నూతన ఐఫోన్లను విడుదల చేస్తుందనే విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా ఐఫోన్ 11 పేరిట కొత్త ఐఫోన్లు విడుదలయ్యాయి. అయితే కొత్త ఐఫోన్లు విడుదల కాగానే ఆపిల్ సహజంగానే పాత ఐఫోన్ల ధరలను తగ్గిస్తుంటుంది. అందులో భాగంగానే గతేడాది విడుదలైన ఐఫోన్ Xఆర్ ఫోన్‌తోపాటు అంతకు ముందు ఏడాది విడుదలైన ఐఫోన్ 7, 7 ప్లస్, 8, 8ప్లస్ ఫోన్ల ధరలను ఆపిల్ భారీగా తగ్గించింది. ప్రస్తుతం తగ్గిన ధరలకే ఆ ఫోన్లను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.

apple slashed old iphone rates

కాగా తగ్గిన ఐఫోన్ల ధరలు ఇలా ఉన్నాయి…

ఐఫోన్ Xఆర్ 64జీబీ – పాత ధర రూ.76,900 – కొత్త ధర రూ.49,900 – తగ్గింపు రూ.27వేలు
ఐఫోన్ Xఆర్ 128జీబీ – పాత ధర రూ.81,900 – కొత్త ధర రూ.54,900 – తగ్గింపు రూ.27వేలు

ఐఫోన్ 8 ప్లస్ 64జీబీ – పాత ధర రూ.69,900 – కొత్త ధర రూ.49,900 – తగ్గింపు రూ.20వేలు
ఐఫోన్ 8 64జీబీ – పాత ధర రూ.59,900 – కొత్త ధర రూ.39,900 – తగ్గింపు రూ.20వేలు

ఐఫోన్ 7 32జీబీ – పాత ధర రూ.39,900 – కొత్త ధర రూ.29,900 – తగ్గింపు రూ.10వేలు
ఐఫోన్ 7 128జీబీ – పాత ధర రూ.49,900 – కొత్త ధర రూ.34,900 – తగ్గింపు రూ.15వేలు

ఐఫోన్ 7 ప్లస్ 32జీబీ – పాత ధర రూ.49,900 – కొత్త ధర రూ.37,900 – తగ్గింపు రూ.12వేలు
ఐఫోన్ 7 ప్లస్ 128జీబీ – పాత ధర రూ.59,900 – కొత్త ధర రూ.42,900 – తగ్గింపు రూ.17వేలు

ఇక ఆపిల్ వాచ్ సిరీస్ 5 స్మార్ట్‌వాచ్‌ల విడుదల నేపథ్యంలో వాచ్ సిరీస్ 3 వాచ్‌ల ధరలను కూడా ఆపిల్ తగ్గించింది. ఈ క్రమంలో వాచ్ సిరీస్ 3 జీపీఎస్ వేరియెంట్ పాత ధర రూ.28,900 ఉండగా రూ.8వేల తగ్గింపుతో ఇప్పుడా వాచ్ రూ.20,900 ధరకు అందుబాటులో ఉంది. అదేవిధంగా ఆపిల్ వాచ్ సిరీస్ 3 జీపీఎస్ + సెల్యులార్ వేరియెంట్ పాత ధర రూ.37,900 ఉండగా ఇప్పుడా వాచ్ రూ.8వేల తగ్గింపుతో రూ.29,900 ధరకు లభిస్తోంది. అయితే ఇవే కాకుండా వాచ్ సిరీస్ 4 వాచ్‌లు, ఇతర పాత ఐఫోన్ల ధరలను కూడా ఆపిల్ త్వరలో తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.