ఆ ఊర్లో రాత్రి ఏడైతే ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్లు పక్కనేస్తారు..గంటన్నరపాటు ఏం చేస్తారంటే..!!

ఈరోజుల్లో టైమ్‌తో సంబంధం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌ వాడుతున్నాం. ఈ టైంలోనే వీటిని వాడలాని రూలేం లేదు కూడా.. కానీ ఆ ఊర్లో ఉందట.. రోజు రాత్రి ఏడు అవగానే సైరన్‌ మోగుతుంది. అంతే ఊర్లోవారంతా..ఫోన్లు, టీవీలు, ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌ అన్నీ. పక్కనేస్తారు. గంటన్నరపాటు వాటి జోలికి వెళ్లరట..ఎందుకు అలా..? ఆ టైంలో వాడితే ఏమవుతుంది..? ఈ కాన్సప్ట్‌ వెనుకున్న కథేంటో మీరు చూడండి..!

మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలోని గ్రామ ప్రజలు రాబోయే ఉపద్రవాన్ని ముందుగానే పసిగట్టేశారు.. అందుకే వారంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. రాత్రి 7 గంటలకు సైరన్ మోగగానే.. ఎన్ని ముఖ్యమైన పనులన్నా సరే ఫోన్ ముట్టుకోరు. కాల్స్ అటెండ్ చేయరు. వాటిని ఇంట్లో పడేసి ఊర్లో తిరుగుతారు. కనీసం పిల్లలకు కూడా ఫోన్లు ఇవ్వరు. టీవీలను సైతం చూడనివ్వరు. దాదాపు గంటన్నరపాటు అవన్నీ ఆఫ్‌లో ఉండాల్సిందే. ఆ టైంలో వారంతా ఏం చేస్తారంటే..

ఆ గంటన్న సమయంలో పిల్లలు పుస్తకాలు తెరిచి బుద్ధిగా చదువుకుంటారు. ఆయా గ్రామాల పెద్దలంతా ఒక చోట కూర్చొని ఊరులో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురంచి చర్చిస్తారు. ఒక్క గ్రామంతో మొదలైన ఈ సాంప్రదాయం ఇప్పుడు ఆ జిల్లాలో ప్రతి గ్రామానికీ పాకుతోండటం విశేషం.. ఇలా చేయడానికి వారు చెప్తున్న కారణం ఏంటంటే..

కరోనా మహమ్మారి తర్వాత పిల్లలు స్కూళ్లకు వెళ్లిన సమయంలో అందరూ సోమరులుగా తయారైనట్లు టీచర్లు గుర్తించారు. చదవడం, రాయడం చేయలేకపోతున్నారని గ్రహించారు. విద్యార్థులు ఎక్కువగా సెల్ ఫోన్లు చూస్తున్నారని గ్రామ సర్పంచ్‌కు చెప్పారు. ఈ నేపథ్యంలో తమ గ్రామంలో డిజిటల్ డిటాక్స్ ఆలోచనను అమలు చేసినట్లు సర్పంచ్ వెల్లడించారు.

డిజిటల్ డిటాక్స్ అంటే ఏమిటి?
గంటల తరబడి ఫోన్లు చూడటం మూలంగా చాలా మంది శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. దీని నుంచి తప్పించుకునేందుకు ఫోన్లు, డిజిటల్ వస్తువులను ఉపయోగించకుండా దూరంగా ఉండటాన్నే డిజిటల్ డిటాక్స్ అంటారు. వీలైనంత వరకూ సామాజిక మాధ్యమాల్లో ఇన్‌యాక్టివ్‌గా ఉండటం ఇందులో భాగమే..!
Attachments area