ఫోన్ మాట్లడాలంటే నెట్‌వర్క్ అవసరం లేదట మీకు తెలుసా?

ప్రస్తుత సమయంలో ఇంట్లో ఏ వస్తువు ఉన్నా లేకపోయినా సెల్ ఫోన్ అనేది కంపల్సరీ అయిపోయింది. ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలు వినియోగించుకునేందుకు సైతం మొబైల్ ఫోన్ లింక్ అయి ఉంది. ఈ క్రమంలోనే ఫోన్ల వాడకం బాగా పెరిగిపోయింది. ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం కూడా బాగా పెరిగింది. ప్రతీ ఒక్కరు సెల్ ఫోన్‌కు అడిక్ట్ అయిపోరాని చెప్పొచ్చు. కాగా, ఈ ఫోన్లు పని చేయడానికి కంపల్సరీగా కావాల్సింది నెట్‌వర్క్.

phones.jpg
phones.jpg

నెట్‌వర్క్ లేకపోతే ఫోన్లు మాట్లాడటం చాలా కష్టం. అయితే, ఒకప్పటిలాగా కాకుండా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని సెల్ టవర్స్ వచ్చాయి. కానీ, కనెక్టివిటీ అనేది ఇంకా కొంత సమస్యగానే ఉంది. ఈ నేపథ్యంలోనే కనెక్టివిటీ ఇష్యూను అధిగమించేందుకుగాను యాపిల్ కంపెనీ సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురాబోతున్నది. యాపిల్ సంస్థ తయారు చేసిన ఆ ఫోన్ నెట్‌వర్క్ లేకున్నా సరే పని చేస్తుందట. ఆ విధంగా యాపిల్ ఐఫోన్ 13‌ని నిపుణులు తయారు చేస్తున్నారు. నెట్‌వర్క్ లేని ప్రాంతాల్లో డైరెక్ట్‌గా శాటిలైట్‌కు కనెక్ట్ అయ్యేందుకుగాను ఈ మొబైల్‌లో క్వాల్ కామ్ ఎక్స్ 60 మొడెమ్‌ను ఉపయోగించినట్లు సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు.

ఈ శాటిలైట్ కనెక్టివిటీ కోసమై యాపిల్ సంస్థ ‘స్పేస్ ఎక్స్’ అనే దిగ్గజ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఐఫోన్ మొత్తం నాలుగు వేరియంట్స్ లో అవెయిలబుల్‌గా ఉంది. ఐఫోన్ 13, ఐఫోన్ 13 ఫ్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్, ఐఫోన్ 13 మినీ వేరియంట్స్‌లో ఈ ఐఫోన్స్ లభిస్తున్నాయి. ఈ క్రమంలోనే టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ మొబైల్ ఫోన్స్‌లోనే కాదు అన్ని రంగాల్లోనూ ఇంకా పెరిగే చాన్సెస్ ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఫ్యూచర్ టెక్నాలజీదే అని పేర్కొంటున్నారు.