ఫేస్‌బుక్ వాడుతున్నారా.. అయితే ఈ ముప్పు త‌ప్ప‌దు..

-

ప్ర‌పంచంలో ఎక్కువ‌మంది ఉప‌యోగించే సోష‌ల్ మీడియా సైట్ల‌లో ఫేస్‌బుక్ ఒక‌టి. ఏ ప‌ని చేస్తున్నా ఫేస్‌బుక్‌పై ఓ క‌న్నేసి ఉంచుతారు.అలాగే ఫేస్‌బుక్ కూడా యూజ‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త ఫీచ‌ర్ల‌ను అందిస్తుంటుంది. అయితే దీని వల్ల కొన్ని రకాల ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఎక్కువగా ముప్పు పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. కొంద‌రు తింటున్నా, నడుస్తున్నా, డ్రై వింగ్‌లో ఉన్నా.. ఏం చేస్తున్నా ఫేస్‌బుక్ ఓపెన్ చేసి చూస్తుండ‌డం అల‌వాటుగా మారిపోయింది.

ఇలా చేయడం వల్ల మెదడులోని ఆ రెండు భాగాల మధ్య సమతుల్యత పోతుందని, ఇది తీవ్రపరిణామాలకు దారితీస్తుందని డీపౌల్‌ యూనివర్సిటీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇక చదువు, ఫేస్‌బుక్‌ విషయానికొస్తే.. క్లాస్‌రూంలోనూ తరచుగా ఎఫ్‌బీ చెక్‌ చేసే విద్యార్థులు అకడమిక్స్‌లో వెనకబడిపోతున్నారని పరిశోధనలో తేలిందన్నారు. పరీక్షల్లో సరైన ప్రదర్శన చేయడంలేదన్నారు. ఆ తర్వాత ఏడాదిపాటూ ఆ విద్యార్థుల ప్రదర్శనలో ఎలాంటి మార్పు ఉండడం లేదన్నారు. అందుకే ఫేస్‌బుక్‌తో బీ కేర్‌ఫుల్‌..!

Read more RELATED
Recommended to you

Latest news