ట్విటర్ కొనుగోలు చేసిన తర్వాత తొలిసారి ఎలాన్ మస్క్ ఆ సంస్థలో అనేక మార్పులు చేశారు. ఇక ముందు కూడా కంపెనీలో పెను మార్పులు చోటుచేసుకుంటాయని తెలిపారు. ఈ సందర్భంగా ట్విటర్ ఉద్యోగులకు ఎలాన్ మస్క్ ఓ లేఖ రాశారు. గడ్డుకాలాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఉద్యోగులకు పంపిన మెయిల్‌లో కోరారు. ట్విటర్ ఆర్థిక పరిస్థితి గురించి లేఖలో ఉద్యోగులకు వివరించారు.
‘‘నేను పంపిన మెసేజ్‌లో తీపికబురు లేదు. క్లిష్టమైన పరిస్థితులు ముందున్నాయి. ఎదుర్కొనేందుకు సిద్ధంకండి’’ అని కోరినట్లు బ్లూమ్‌బెర్గ్ తన కథనంలో పేర్కొంది. వర్క్‌ఫ్రం హోమ్ పద్ధతి ముగిసిందని, ఉద్యోగులు తప్పనిసరిగా వారంలో 40 గంటలు ఆఫీసు నుంచి పనిచేయాలని ఆదేశించారు. ఇకపై ఇంటి నుంచి పనిచేయాలంటే తన అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఉద్యోగులకు సూచించారు. మస్క్ ట్విటర్ బాధ్యతలు చేపట్టి రెండు వారాలు పూర్తైన సందర్బంగా ఆయన ఉద్యోగులకు ఈ-మెయిల్ సందేశాన్ని పంపారు.