డబ్బులులేకపోయినా Flipkart లో వస్తువులు కోనేయచ్చు..ఎలా అంటే..!!!

-

పండగ వస్తోందంటే చాలు Flipkart, amazon వంటి ఆన్లైన్ షాపింగ్ దిగ్గజాలు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తూనే ఉంటాయి. డబ్బులు చేతిలో దండిగా ఉండాలే కానీ ఎలాంటి వస్తువు అయినా క్షణాల్లో కోనేయచ్చు. నచ్చిన వస్తువుని తక్కువ ధరకే ఇంట్లో తెచ్చి పెట్టుకోవచ్చు. కానీ పండగ సమయంలో ఆ ఖర్చు ఈ ఖర్చు అంటూ రకరకాల ఖర్చులు ఉంటాయి మరి షాపింగ్ కి ప్రత్యేకంగా డబ్బు వేచ్చించాలంటే బడ్జెట్ సరిపోని వాళ్ళు ఎంతో మంది ఉంటారు. నచ్చిన వస్తువు తక్కువ ధరకే వస్తున్నా సరే కొనలేని పరిస్థితిలో ఉంటారు అలాంటి వారికోసం Flipkart pay later అనే కొత్తం విధానాన్ని ప్రవేశపెట్టింది.

Image result for flipkart pay later

ఈ pay later తో మనచేతిలో డబ్బు లేకుండానే Flipkart లో నచ్చిన వస్తువుని సొంతం చేసుకోవచ్చు. ఎవరైనా తమ కస్టమర్లు డబ్బులు లేకపోయినా తమ వద్ద ఉన్న వస్తువులు కొనే సదుపాయం Flipkart గత ఏడాది నుంచే మొదలు పెట్టింది. అయితే దసరా, దీపావళి కి ఈ ఆఫర్ కస్టమర్లకి బాగా ఉపయోగపడనుంది.

Related image

ఇదిలాఉంటే ఒక వేళ వినియోగ దారులు Flipkart pay later ద్వారా డబ్బులు చెల్లించలేకపోయినా సరే రూ 5000 వేల వరకూ షాపింగ్ చేసే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఈ సొమ్ముని 40 రోజుల్లోగా చెల్లించాలి లేకపోతే అదనపు చార్జీలు వర్తిస్తాయి.  ఇక కార్డ్ లెస్ క్రెడిట్ అయితే దాదాపు ఒక లక్ష రూపాయల వరకూ షాపింగ్ చేయవచ్చు ఈ సొమ్ముని నిర్ణీత కాల వ్యవధిలో EMI ల రూపంలో చెల్లించవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news