సూపర్‌ బైక్‌..17 రూపాయిలతో 116 కిలోమీటర్ల ప్రయాణం!

-

పెరుగుతున్న ఎలక్ట్రిక్‌ బైకుల విక్రయాల నేపథ్యంలో అదిరిపోయే బైక్‌తో ముందుకు వచ్చింది స్టార్టప్‌ కంపెనీ. ఈ బైక్‌ను ప్రత్యేకమై షాకెట్‌ తో ఛార్జింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బైకులకు కేవలం సెల్‌ ఫోన్‌ కు ఛార్జింగ్‌ పెట్టుకున్నట్లు పెడితే సరిపోతుంది. ఇక రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్‌ ధరల వల్ల వీటిపై మక్కువ పెరుగుతోంది. ఇటువంటి ప్రతికూట సమయాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి పలు స్టార్టప్‌ కంపెనీలు.

ఇప్పటికే పలు ఎలక్ట్రిక్‌ వాహానాలు అందుబాటులో ఉన్నా, అవి మరి కొంత మంది సామాన్యులకు చెరువకావల్సిన అవసరం ఉంది. హైదరాబాద్‌ కు చెందిన ఈ సంస్థ ప్యూర్‌ ఈవీ (pure EV) అనే సంస్థ హై స్పీడ్‌ మోటార్‌ బైకులు రూపోందించి. కేవలం ఒకసారి చార్జీంగ్‌ చేస్తే చాలు దాదాపు 116 కీమీ లు ఈ బైక్‌ పై మనం ప్రయాణం చేయవచ్చని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.
అదికూడా సాధారణ పవర్‌ ఖర్చుతో. ఒక్క సారి ఛార్జీంగ్‌ పెడితే 17 రూపాయిలు విలువ చేసే పవర్‌ ఖర్చు అవుతుందని సంస్థ ప్రతినిధులు చెప్పారు. కేవలం 5 సెకన్లు లోనే దాదాపు 40 కీలోమీటర్ల స్పీడ్‌ ను ఈ బైక్‌ అందుకోగలగుతుంది. అదేవిధంగా గంటకు 60 కిలోమీటర్ల స్పీడ్‌ తో ప్రయాణించవచ్చు అంటే రిగ్యూలర్‌ బైక్‌ లు వెళ్లే స్పీడ్‌ ఈ బైక్‌ వెళ్లుతుంది. 2.5 కేడ్లూ్యహెచ్‌ లిథియోమ్‌ బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. ఒకసారి బైక్‌ ఫుల్‌ ఛార్జింగ్‌ చేస్తే కేవలం 2.5 పవర్‌ యూనిట్లు మాత్రమే ఖర్చు అవుతాయని సంస్థ యాజమానులు చెబుతున్నారు. ఇప్పుడు మార్కెట్‌ లో బుకింగ్స్‌ కూడా జరుగుతున్నాయని ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ.79,999 గా కంపెనీ నిర్ణయించింది. ఐదేళ్ల వారంటీతోపాటు వచ్చే ఈ బైక్‌ తీసుకోవడానికి పలు బ్యాంకులు కూడా లోన్‌ సౌకర్యం కూడా అందిస్తోన్నాయి. ముఖ్యంగా బ్యాటరీ వాహానాలు అంటేనే చార్జింగ్‌ షాకేట్‌ లు ప్రధామైన సమస్య. ఈ బైక్‌ లకు రెగ్యూలర్‌ ఎలక్ట్రికల్‌ బైకులకు అవసరమైన 25 యాంప్‌ అవసరం లేదు. సాధారణమైన ఇంట్లో ఉపయోగించుకునే షాకెట్‌ ద్వారానే మనం ఈ బైక్‌ ను చార్జ్‌ చేసుకోవచ్చు. మార్కెట్‌ లో అందుబాటులో ఉన్న వాటికంటే ఇంకా సౌకర్యవంతంగా ఉండాలని ఈ బైక్‌ను తయారు చేశారు. ఇది ధరలోనే∙కాదు వాడుకలో కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news