ఎండలో ఫోన్‌ వాడితే పాక్షిక అంధత్వం తప్పదా..? అధ్యయనాలు చెప్తున్న వాస్తవాలు..!!

-

ఈ రోజుల్లో స్కీన్‌ చూడడం చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ అందరికీ ఎక్కువగానే ఉంటుంది. స్కీన్‌ టైమ్‌ ఎంత పెరిగితే ఆరోగ్య సమస్యలు కూడా అంతే పెరుగుతాయి. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లోనే మన కళ్లు. ముఖ్యంగా ఇది కంటి ఆరోగ్యానికి పెద్ద సమస్యగా మారింది. కంటి సమస్యలు అనేక కారణాల వల్ల సంభవించవచ్చు, వాటిలో ఒకటి ఫోన్‌లను నిరంతరం ఉపయోగించడం. సిగిరెట్‌ తాగితే క్యాన్సర్‌ వస్తుంది తెలిసి కూడా ఆ అలవాటు మానలేరు..అలాగే ఫోన్లు ఎక్కువ వాడితే తలనొప్పి, కంటిచూపు మందగించడం లాంటి సమస్యలు వస్తాయి అని కూడా మనకు తెలుసు..కానీ ఏం చేస్తాం అలవాటైపోయింది. అయితే మాములుగా ఫోన్‌ వాడిందానికంటే..ఎండలో ఫోన్‌ వాడటం వల్ల నష్టం ఇంకా ఎక్కువగా ఉంటుందట..తాజాగా జరిగిన కొన్ని అధ్యయనాలు ఈ విషయాన్ని తేల్చాయి.

జర్నల్ ఆఫ్ మెడికల్ కేస్ రిపోర్ట్స్ ప్రకారం… పగటిపూట మొబైల్ పరికరాన్ని తదేకంగా చూడటం వల్ల పాక్షికంగా అంధత్వం వచ్చే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.. అందుకే ఎండలో ఫోన్‌లను ఉపయోగించడం కళ్లకు ప్రమాదకరమని వైద్యులు చెప్తున్నారు. ఫోన్ స్క్రీన్‌పై సూర్యుని యొక్క శక్తివంతమైన ప్రతిబింబానికి గురికావడం వల్ల రెటీనాకు కొంత తీవ్రమైన నష్టం జరుగుతుందట. మాక్యులోపతిని మాక్యులార్ డీజెనరేషన్ అని కూడా పిలుస్తారు, ఇది మాక్యులా అని పిలువబడే రెటీనా వెనుక భాగాన్ని ప్రభావితం చేసే వ్యాధి. మాక్యులోపతి ఉన్నవారు పూర్తిగా అంధులుగా మారరు, కానీ దృష్టి కేంద్రీకరణను మాత్రం కోల్పోతారు. సోలార్ మాక్యులోపతి విషయంలో, సూర్యరశ్మికి నేరుగా గురికావడం వల్ల రెటీనా, మాక్యులా దెబ్బతినవచ్చు. దీనివల్ల దూరంగా ఉన్న ఆకారాలను గుర్తించడంలో ఇబ్బంది ఏర్పడుతుంది.

సోలార్ మాక్యులోపతి అనేది సాధారణంగా సూర్యుని వైపు నేరుగా చూసే రోగులలో సంభవిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో ఫిల్టర్‌తో సన్ గ్లాసెస్‌ని ఉపయోగించాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు.

సూర్య కిరణాలలోని UVA , UVB రేడియేషన్ కంటిశుక్లం, మచ్చల క్షీణత అభివృద్ధి చెందే ప్రమాదాన్ని పెంచుతుంది. UV ఎక్స్పోజర్ వల్ల దీర్ఘకాలిక ప్రభావాలు చివరికి దృష్టిని తగ్గిస్తాయి. కంటి వ్యాధుల నుంచి మీ కళ్ళను రక్షించుకోవడానికి సమర్థవంతమైన సన్ గ్లాసెస్ ధరించాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఫోన్‌ వాడకున్నా లేకున్నా..ఎండలో బయటకు వెళ్లేప్పుడు సన్‌గ్లాస్‌సె ధరించడం ఉత్తమం.

Read more RELATED
Recommended to you

Latest news