రూ.1778 ఈఎంఐతో 55 ఇంచుల 4కె టీవీని సొంతం చేసుకోండి.. ఐఫాల్క‌న్ నుంచి కొత్త స్మార్ట్ టీవీ..!

టీవీల త‌యారీ సంస్థ ఐఫాల్క‌న్ కె72 సిరీస్‌లో ఓ నూత‌న స్మార్ట్ టీవీని భార‌త్ లో విడుద‌ల చేసింది. ఐఫాల్క‌న్ కె72 55 ఇంచుల 4కె స్మార్ట్ టీవీని ఆ సంస్థ ఆవిష్క‌రించింది. ఇందులో ప‌లు అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

ఐఫాల్క‌న్ కె72 55 ఇంచుల 4కె స్మార్ట్ టీవీలో క్యూలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీని వ‌ల్ల డిస్‌ప్లే క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. మ‌ల్టిపుల్ హెచ్‌డీఎంఐ పోర్టులు, యూఎస్‌బీ పోర్టులను ఏర్పాటు చేశారు. డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై ఫీచ‌ర్ ల‌భిస్తుంది.

ఈ స్మార్ట్ టీవీలో 4కె డిస్‌ప్లే ఉంది. ఆండ్రాయిడ్ 11 ఓఎస్ ఆధారంగా ఈ టీవీ ప‌నిచేస్తుంది. డాల్బీ విజ‌న్‌, డాల్బీ అట్మోస్ ఫీచ‌ర్‌ల‌ను ఇందులో అందిస్తున్నారు. హెచ్‌డీఆర్‌10కు ఇందులో స‌పోర్ట్ ల‌భిస్తోంది. ప‌లు ర‌కాల యాప్స్ ఇందులో ఇన్‌బిల్ట్‌గా ల‌భిస్తున్నాయి. యూట్యూబ్‌, నెట్ ఫ్లిక్స్‌, డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ యాప్ ల‌ను అందిస్తున్నారు. ఇత‌ర యాప్‌ల‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

ఈ టీవీ ధ‌ర రూ.51,999 ఉండ‌గా సుల‌భ ఈఎంఐల‌లో దీన్ని కొనుగోలు చేయ‌వ‌చ్చు. బ్లాక్ క‌ల‌ర్ ఆప్ష‌న్ లో మాత్ర‌మే ఈ టీవీ ల‌భిస్తోంది. ఒక సంవ‌త్స‌రం వారంటీని అందిస్తున్నారు. ప‌లు ర‌కాల బ్యాంకు ఆఫ‌ర్ల కింద ఈ టీవీపై రూ.1250 వ‌ర‌కు డిస్కౌంట్‌ను పొంద‌వ‌చ్చు. అలాగే నెల‌కు రూ.1778 ఈఎంఐతో ఈ టీవీని కొనుగోలు చేయ‌వ‌చ్చు. దీన్ని ఫ్లిప్‌కార్ట్ లో విక్ర‌యిస్తున్నారు.