డెల్ గేమింగ్ ల్యాప్ టాప్ లాంచ్..స్పెసిఫికేషన్స్..

-

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ డెల్.. గేమర్ల కోసం కొత్తగా మరో ల్యాప్‌టాప్‌ తీసుకొచ్చింది. మంచి స్పెసిఫికేషన్లతో.. అదిరిపోయే గేమింగ్ ఫీచర్లతో డెల్ జీ15 5525 ను లాంచ్ చేసింది. మొత్తంగా ఐదు విభిన్నమైన కన్ఫిగరేషన్ ఆప్షన్స్‌లో ఈ జీ15 AMD ఎడిషన్‌ ల్యాప్‌టాప్‌ లభిస్తోంది. ఎన్విడియా జెఫోర్స్ ఆర్‌టీఎక్స్ 3060 వరకు గ్రాఫిక్ ప్రాసెస్ యూనిట్ ఉంటుంది. ఏఎమ్‌డీ రైజన్ 6000H సిరీస్ ప్రాసెసర్‌తో వస్తోంది. 15.6 ఇంచుల డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. 8జీబీ నుంచి 16 జీబీ వరకు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. గేమింగ్ కోసం పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉండేలా చాలా ఫీచర్లు ఉన్నాయి..

స్పెసిఫికేషన్లు,ధర..

ఈ ల్యాప్‌టాప్‌ 15.6 ఇంచుల Full HD రెజల్యూషన్ డిస్‌ప్లేతో వస్తోంది. అన్ని వేరియంట్లు ఇదే డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. ఈ మోడల్‌లో బేస్ వేరియంట్‌ ఏఎండీ రెంబ్రాంట్ ఆర్5 ప్రాసెసర్‌,ఇందులో 8జీబీ ర్యామ్, 512 SSD ర్యామ్, విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌‌పై ఈ ల్యాప్‌టాప్‌లు రన్ అవుతాయి. రెండో వేరియంట్ కూడాా ఇదే స్పెసిఫికేషన్లను కలిగి ఉంది. అయితే ఇందులో ర్యామ్ అదనంగా ఉంటుంది.

మూడో వేరియంట్ కూడా దాదాపు ఇవే స్పెసిఫికేషన్లతో ఉంటుంది.. ప్రాసెసర్‌ విషయంలో అప్‌గ్రేడ్‌గా ఉంది. ఏఎండీ రెంబ్రాంట్ ఆర్7 చిప్‌ను కలిగి ఉంది. నాలుగో వేరియంట్ ఇదే ప్రాసెసర్‌తో వస్తుండగా, ఐదో టాప్ వేరియంట్ విషయానికి వస్తే.. ఇది Nvidia RTX 3060 6GB జీపీయూను కలిగి ఉంటుంది..గేమ్స్‌ ఆడినా హీట్ అయి పర్ఫార్మెన్స్‌పై ఎలాంటి ప్రభావం పడకుండా ఇవి సహాయపడాయి. ఇక గేమింగ్ మరింత అత్యుత్తమంగా ఉండాలనుకుంటే డైమనిక్ పర్ఫార్మెన్స్ మోడ్ కూడా మార్చుకోవచ్చును.

ధర..

డెల్ జీ15 5525 బేస్ వేరియంట్ ధర రూ.83,600గా ఉంది. ఇదే మోడల్‌లో 16జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.89,990గా ఉంది.ఇదే మోడల్‌లో 16జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.89,990గా ఉంది.R7 ప్రాసెసర్‌ ఉన్న వేరియంట్ ధరను రూ.1,02,990, ఇదే ప్రాసెసర్‌, Nvidia RTX 3050 Ti జీపీయూను కలిగి ఉన్న మోడల్ ధరను రూ.1,07,900గా డెల్ నిర్ణయించింది. ఇక Nvidia RTX 3060 6GB జీపీయూ ఉన్న టాప్‌ వేరియంట్ రూ.1,27,990 ధరకు లాంచ్ అయింది..

Read more RELATED
Recommended to you

Latest news