బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ చైర్మన్‌గా నందమూరి బాలకృష్ణ బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసింది. అయితే.. బాలకృష్ణ ఇటీవల తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావును కలిసి.. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి 22వ వార్షికోత్సవ వేడుకులకు ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఈ వేడుకలకు హజరైన మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ… ఎన్టీఆర్‌కి, కేసీఆర్ కు మంచి అనుబంధం ఉందని, 753 కోట్ల రూపాయలు క్యాన్సర్ బాధితుల కోసం ఖర్చు చేశామన్నారు. బసవతారకం ఆస్పత్రిలో 3 లక్షల మంది బాధితులకు వైద్యం అందించారని, క్యాన్సర్ పెరగడం దురదృష్టకరమన్నారు. 75 శాతం మంది ప్రజలు రోగం వస్తే కానీ ఆలోచించరని, క్యాన్సర్ పెరగడానికి చాలా కారణాలన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
క్యాన్సర్ నివారించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, క్యాన్సర్ శరీరంలో ఉందనే విషయమే గుర్తించడం కష్టమన్నారు మంత్రి హరీష్‌రావు. హెల్త్ ప్రొఫైల్ ద్వారా ఆరోగ్యం పట్ల చైతన్యం పెరుగుతుందని మంత్రి హరీష్‌రావు అన్నారు. కీమో థెరపీ సేవలు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో తెస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఎన్టీఆర్ సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని, హెల్త్ మినిస్టర్ అయ్యాక బాలకృష్ణ నా దగ్గరకు రెండు సార్లు వచ్చి కలిశారని, బాలకృష్ణ కరుకుగా కనిపిస్తారు… మనసు మాత్రం సాఫ్ట్ అన్నారు. బయట బాలకృష్ణ వేరు… లోపల బాలకృష్ణ వేరు అని వ్యాఖ్యానించారు మంత్రి హరీష్‌రావు.