గూగుల్‌ మీట్‌లో మీటింగ్స్‌ ఇకపై యూట్యూబ్‌ లైవ్‌లో కూడా..!

-

గూగుల్ తన కష్టమర్స్‌ కోసం.. అదిరిపోయే ఫీచర్‌ ఒకటి వచ్చింది. ఇప్పుడు వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ చేసే చాలా కంపెనీలు వారి మీటింగ్స్‌ను గూగుల్‌ మీట్‌లోనే పెట్టుకుంటున్నాయి. ఇక పై యూట్యూబ్‌లో లైవ్‌ స్ట్రీమ్‌ కూడా చూడొచ్చు. మీటింగ్ యాక్టివిటీస్ ప్యానెల్‌కు మీటింగ్‌ను నేవిగేట్ చేసి లైవ్ స్ట్రీమింగ్ సెలక్ట్ చేసుకోవచ్చట.. యూజర్లు వారి ఛానెల్‌ను సెలక్ట్ చేసుకుని మీటింగ్ స్ట్రీమింగ్‌ను స్టార్ట్ చేసుకోవచ్చు.

గూగుల్‌ మీట్‌ యూజర్లు ఇప్పటి వరకూ మీటింగ్స్‌ను గూగుల్‌ మీట్‌ ద్వారానే పెట్టుకునే వారు.. కానీ ఇప్పడు వచ్చిన ఫీచర్‌ పై కంపెనీ ఏం చెప్తుందంటే.. “వినియోగదారులు తమ సంస్థయేతరులకు ఎక్కువ సమాచారాన్ని అందించాలనుకునే సందర్భాల్లో ప్రత్యక్ష ప్రసారం ఉపయోగకరంగా ఉంటుంది, తద్వారా పాజ్ చేసుకోవడానికి, అవసరమైనప్పుడు రీప్లే చేసుకునే వీలు కల్పిస్తుంది” అని Google అంటోంది.

YouTubeలో ప్రత్యక్ష ప్రసారం కోసం ఛానెల్ అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. Google Meet ద్వారా లైవ్‌స్ట్రీమ్ చేయడానికి ముందుగా ఛానెల్ తప్పనిసరిగా ఆమోదించాలని వినియోగదారులకు Google హెచ్చరించింది. హోస్ట్ మేనేజ్‌మెంట్ ఆన్‌లో ఉన్నప్పుడు, హోస్ట్, సహ-హోస్ట్‌లకు మాత్రమే సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయగలిగే యాక్సెస్ ఉంటుందట.. వారు ఆఫ్‌లో ఉంటే, మీటింగ్‌కు హాజరయ్యే ఎవరైనా దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేసే వీలుంటుంది. సమావేశాన్ని లైవ్ స్ట్రీమింగ్ చేయడం వంటి ఫీచర్, ఇతర ప్లాట్‌ఫారమ్‌ల నుండి మీట్‌ను వేరు చేయడానికి Google మరో మార్గంగా ఎంచుకున్నట్లుగా కనిపిస్తుంది.

ఇప్పుడు తీసుకొచ్చిన ఫీచర్‌ ఉద్యోగులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీటింగ్‌కు అటెండ్‌ అయి వినే మూడ్‌ లేకున్నా, సరిగ్గా అర్థంకాకున్నా.. యూట్యూబ్‌ ద్వారా మళ్లీ పాస్‌ చేసి వినొచ్చు. కావల్సినప్పుడు రివైస్‌ చేసుకుని చూడొచ్చు. ఆన్‌లైన్‌ క్లాసులు వినే స్టూడెంట్స్‌కు కూడా మంచి యూస్‌ అవుతుందని టెక్కీస్‌ అంటున్నారు.
Attachments area

Read more RELATED
Recommended to you

Latest news