మొబైల్స్ తయారీదారు షియోమీ ఇటీవలే ఎంఐ 10ఐ 5జి పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫోన్‌ను లాంచ్ చేసిన కేవలం 3 వారాల వ్యవధిలోనే రూ.400 కోట్ల మేర అమ్మకాలు జరిగాయి. ఈ మేరకు షియోమీ ఒక ప్రకటనలో తెలిపింది. జనవరి 7వ తేదీన ఈ ఫోన్‌ను అమ్మకానికి ఉంచగా మొత్తం రూ.400 కోట్ల మేర అమ్మకాలు జరిగినట్లు షియోమీ తెలిపింది.
కాగా జనవరి 2021 గూగుల్ సెర్చ్ నివేదిక ప్రకారం భారత్‌లో జనవరి నెలలో యూజర్లు అత్యధికంగా వెదికిన ఫోన్ల జాబితాలో ఎంఐ 10ఐ 5జి మొదటి స్థానంలో ఉంది. ఈ విషయాన్ని కూడా షియోమీ స్వయంగా వెల్లడించింది. ఈ ఫోన్‌లో 5జి ఫీచర్‌ను అందిస్తుండడం, 108 మెగాపిక్సల్ భారీ కెమెరాను ఏర్పాటు చేయడం, ధర తక్కువగా ఉండడం.. వంటి కారణాల వల్ల ఈ ఫోన్‌ను అత్యధిక మంది కొనుగోలు చేశారు.
షియోమీ ఎంఐ 10ఐ 5జి స్మార్ట్ ఫోన్‌లో… 6.67 ఇంచుల ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ లభిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 750జి ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 108 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 16 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 5జి, 4820 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.20,999గా ఉంది. అమెజాన్, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.