ఐఫోన్‌ 11పై బంపర్‌ ఆఫర్.. రూ. 41 వేల ఫోన్‌ను రూ. 21వేలకే పొందొచ్చు..!

-

మార్కెట్‌లో యాపిల్‌ ఐఫోన్‌కు ఎంత క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. క్రేజ్‌ ఎంతుందో కాస్ట్‌ కూడా అంతే ఉంటుంది. హాట్‌ కేకుల్లా అమ్ముడవుతాయి. కానీ అంత కాస్ట్లీ ఫోన్‌ మన బడ్జెట్ రేంజ్‌లో వస్తే.. అంతకు మించిన ఆనందం ఇంకేముంది..! ప్రముఖ ఈ–కామర్స్​ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ బంపరాఫర్ ప్రకటించింది. యాపిల్‌ ​ ఫోన్లలో అత్యంత ప్రజాదరణ కలగిన ఐఫోన్​ 11పై (iphone 11) అదిరిపోయే డిస్కౌంట్‌ అందిస్తోంది.
2020లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన ఈ స్మార్ట్‌ఫోన్‌కి ఇప్పటికీ మార్కెట్‌లో క్రేజ్‌ అలానే ఉంది. ఐఫోన్​11ను మంచి కెమెరా, మంచి పర్ఫార్మెన్స్ గల స్మార్ట్‌ఫోన్‌గా ​ ఐఫోన్ లవర్స్ భావిస్తుంటారు. ఇటీవల యాపిల్‌​ ఐఫోన్​14 సిరీస్‌ను ప్రారంభించిన తర్వాత వీటి తయారీని కంపెనీ నిలిపివేసింది. అయినప్పటికీ యాపిల్‌ ఐఫోన్ 11 అనేక ఈ–కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులోనే ఉంది. యాపిల్‌ ​ నుంచి కొత్త సిరీస్​లు అందుబాటులోకి వస్తున్నప్పటికీ.. దీని క్రేజ్​ మాత్రం అదే లెవల్‌లో ఉంది.
యాపిల్‌ ఐఫోన్ 11 సిరీస్ భారతదేశంలో 2019లో రూ.64,900 ప్రారంభ ధరతో లాంచ్‌ అయింది. ఐఫోన్ 11 సిరీస్‌లో యాపిల్‌ ఐఫోన్ 11 బేస్ మోడల్, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రో వంటి మొత్తం మూడు మోడల్స్ ఉన్నాయి… అయితే తాజా ఆఫర్​ కింద ఫ్లిప్‌కార్ట్‌లో దీన్ని కేవలం రూ.21,450 వద్ద కొనుగోలు చేయవచ్చు.
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్​11 రూ.40,999 వద్ద లిస్ట్​ అయ్యింది. యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై అందిస్తున్న డిస్కౌంట్​ ద్వారా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ కూడా పొందవచ్చు. అంటే దాదాపు రూ.2,049 తగ్గింపు లభిస్తుంది. దీనితో పాటు, ఎక్స్​ఛేంజ్​ ఆఫర్​ కింద మరో రూ.17,500 తగ్గింపును కూడా పొందవచ్చు. ఈ ఆఫర్‌లను వినియోగించుకొని ఫోన్‌ను కేవలం రూ.21,450 ధర వద్ద హ్యాపీగా కొనుగోలు చేయవచ్చు.
ఐఫోన్​ 11లో బెస్ట్‌ ఫీచర్లు
ఐఫోన్​ 11 ఫీచర్లను పరిశీలిస్తే.. ఇది 6.1-అంగుళాల లిక్విడ్ రెటినా HD డిస్‌ప్లేతో వస్తుంది. ఇది A13 బయోనిక్ చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు డ్యూయల్ 12MP సెన్సార్​ కెమెరా, ముందు భాగంలో 12MP సెల్ఫీ షూటర్‌ కెమెరాలు ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news