వన్‌ప్లస్ నుంచి OnePlus Nord 2T స్మార్ట్ ఫోన్.. స్పెసిఫికేషన్స్ ఇవే..!

-

వరుసగా బడ్జెట్ ఫోన్లను విడుదల చేస్తున్న వన్‌ప్లస్ ఇప్పుడు మరో కొత్త ఫోన్ ను లాంఛ్ చేసింది. నార్డ్ సిరీస్ లో భాగంగా.. OnePlus Nord 2T స్మార్ట్ ఫోన్ ను విడుదల అయింది. ఇది ప్రజెంట్ యూరప్ లో విడుదల చేశారు. త్వరలోనే ఇండియన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. మరీ ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు, కాస్ట్ ఎంత ఉందో చూద్దామా..!

feature

వన్‌ప్లస్ నార్డ్ 2టీ ధర

ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే ఇచ్చారు… 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఉన్న దీని ధరను 399 యూరోలుగా అంటే సుమారు రూ.32,100గా నిర్ణయించారు. బ్లాక్, గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
ఈ ఫోన్ మనదేశంలో ఈ ఫోన్ లాంచ్ అయితే.. ధర రూ.25 వేలలోపే ఉంటుందని సమాచారం.

వన్‌ప్లస్ నార్డ్ 2టీ హైలెట్స్..

ఇందులో 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు.
స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది.
ఫ్రంట్ కెమెరా కోసం హోల్ పంచ్ డిజైన్‌ను ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించారు.
మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉంది.
5జీ, డ్యూయల్ 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్, గ్లోనాస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, ఎన్ఎఫ్‌సీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో అందించారు.

బ్యాటరీ సామర్థ్యం..

4500 ఎంఏహెచ్‌గా ఉంది. 80W సూపర్ వూక్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 50W ఎయిర్‌వూక్ ఫాస్ట్ వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్ కూడా అందించారు. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టంపై వన్‌ప్లస్ నార్డ్ 2టీ పనిచేస్తుంది.

కెమేరా క్వాలిటీ..

ఫోన్ వెనకవైపు మూడు సెన్సార్లు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం.. 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్766 సెన్సార్‌ను అందించారు. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ లెన్స్ కూడా ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

Read more RELATED
Recommended to you

Latest news