నారాయణను అరెస్ట్ చేశారు…విద్యా శాఖ మంత్రిని ఎందుకు అరెస్ట్ చేయరు..? ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి. నారాయణ సంస్థల్లో సిబ్బందిని అరెస్ట్ చేసి.. ఆ తర్వాత నారాయణ అరెస్ట్ చేశారని అగ్రహించారు. ప్రభుత్వ టీచర్లను అరెస్ట్ చేశారు కదా.. విద్యా శాఖ మంత్రిని ఎందుకు అరెస్ట్ చేయరు..? అని నిలదీశారు.
పదో తరగతి పరీక్షల నిర్వహాణలో ప్రభుత్వం పరువు పోయిందని.. ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని విమర్శించారు. రాజకీయాల్లోకి వచ్చాక నారాయణ తన విద్యా సంస్థల నిర్వహణ నుంచి తప్పుకున్నారు… నారాయణ విద్యా సంస్ఖలకు నారాయణ ఫౌండర్ ఛైర్మన్.. ఇప్పుడు ఛైర్మన్ కాదని చెప్పారు.
నారాయణ విద్యా సంస్థలంటే అంత తేలిగ్గా ఉందా..? ప్రతి మాజీ మంత్రిని అరెస్ట్ చేసి దోషులుగా నిలబెడతారా..? అని ఫైర్ అయ్యారు. ఏపీ పరువు పొగొట్టిన వైసీపీ ప్రభుత్వమా.. నారాయణను అరెస్ట్ చేసేది..? అని నిప్పులు చెరిగారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి.