లాంచ్‌కు ముందే లీకైన OPPO Reno 10 సిరీస్ స్పెసిఫికేషన్స్

OPPO సంస్థ రీసెంట్‌గా చైనాలో OPPO Reno 9 సిరీస్‌ని లాంచ్ చేసింది. ఈ లైనప్లో కంపెనీ మూడు ఫోన్లను లాంచ్ చేసింది. వీటిలో రెండు ఈ ఏడాదిలోనే లాంచ్ అవుతాయని సమాచారం.. అయితే, తాజాగా తెలిసిన విషయం ఏంటంటే, ఒప్పో సంస్థ భారత్‌లో OPPO Reno 9 సిరీస్‌ని లాంచ్ చేయడం లేదంట. దాని స్థానంలో 2023 లోనే OPPO Reno 10 సిరీస్‌ని లాంచ్ చేయాలని భావిస్తోంది. ఈ లైనప్‌లో OPPO Reno 10, OPPO Reno 10 Pro, OPPO Reno 10 Pro+ 5G డివైజెస్ లాంచ్ కానున్నాయి.
2023 ద్వితీయార్థంలో OPPO Reno 10 సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈలోపు OPPO Reno 10 సిరీస్‌కి సంబంధించిన ఒక కొత్త నివేదిక బయటకు వచ్చింది. ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ OPPO Reno 10 సిరీస్‌కి సంబంధించిన ముఖ్యమైన సమాచారంతో పాటు స్పెసిఫికేషన్స్ లీక్‌ చేసింది.

లీకైన OPPO Reno 10 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)

OPPO 10 Pro+ 5G
స్టాండర్డ్ వేరియంట్ OPPO Reno 10 డివైజ్ 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 2x పొట్రెయిట్ లెన్స్, 32ఎంపి ఫ్రంట్ కెమెరా సెన్సర్, కర్వ్డ్ డిస్ప్లే తో వస్తుందని డిజిటల్ చాట్ స్టేషన్ తెలిపింది.
OPPO Reno 10 Pro+ 5G డివైజ్ 1.5కే డిస్ప్లే, 1220*2712 పిక్సెల్స్ రెజుల్యూషన్, 50ఎంపి సోని ఐఎంఎక్స్890 మెయిన్ కెమెరా సెన్సర్ తో వస్తున్నట్లు టిప్‌స్టర్ తెలిపింది.
ఇదే కెమెరా సెన్సర్ ని రెనో 9 ప్రో+ 5జీ, వన్‌ప్లస్ 11 మరియు రియల్మీ జీటీ నియో 5 5జీ డివైజెస్ లో వాడారు.
OPPO Reno 10 Pro+ 5G డివైజ్ పెరిస్కోప్ కెమెరా తో వస్తున్నట్లు సమాచారం.
OPPO Reno 10 Pro+ 5G స్మార్ట్ ఫోన్ 4600 ఎంఏహెచ్ డ్యూయల్-సెల్ బ్యాటరీ యూనిట్ ఉంటుంది.
ఈ ఫోన్ లో 80 వాట్ లేదా 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
OPPO Reno 10 Pro+ 5G యొక్క డిజైన్ రెండర్ కూడా రివీల్ అయ్యింది.
దాన్ని చూస్తుంటే, కొత్త కెమెరా మాడ్యూల్ డిజైన్ ని ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఫోన్ పిల్-షేప్డ్ కెమెరా మాడ్యూల్ తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోంది. త్వరలోనే OPPO Reno 10 సిరీస్ కి సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి.