లాంచ్‌కు రెడీ అయిన Oppo Reno 8 Pro 5G స్మార్ట్‌ ఫోన్..!!

-

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో తన కొత్త ఫోన్‌ను త్వ లాంచ్ చేయనుంది. అదే ఒప్పో రెనో 8 ప్రో 5జీ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ లిమిటెడ్ ఎడిషన్. ఒప్పో రెనో 8 ప్రో 5జీ ఇప్పటికే మనదేశంలో లాంచ్ అయింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ లెదర్ ఫినిష్‌తో రానుంది. దీని ధర కూడా రూ. 40 వేలు పైనే ఉంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌తో అదిరిపోయే కెమెరా అందించారు. ఇంకా ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ ఇలా ఉన్నాయి..

ఒప్పో రెనో 8 ప్రో 5జీ హోస్ ఆఫ్ ది డ్రాగన్ ధర..

దీని ధరను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర ఒప్పో రెనో 8 ప్రో 5జీ మనదేశంలో రూ.45,999 ధరతో లాంచ్ అయింది.
గ్లేజ్డ్ బ్లాక్, గ్లేజ్డ్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

ఒప్పో రెనో 8 ప్రో 5జీ హోస్ ఆఫ్ ది డ్రాగన్ స్పెసిఫికేషన్లు..

ఈ ఫోన్‌ ఫీచర్లు ఒప్పో రెనో 8 ప్రో 5జీ తరహాలోనే ఉండనున్నాయి.
ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు.
దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కూడా ఉంది.
ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100 మ్యాక్స్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది.
12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్ కూడా ఇందులో ఉంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే…

ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా అందించారు. ఇక సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

Read more RELATED
Recommended to you

Latest news