బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్స్‌తో రానున్న Redmi 11 5G.. స్పెసిఫికేషన్స్‌ ఇవే..!

-

రెడ్‌మీ నుంచి.. కొత్త ఫోన్‌ మన దేశంలో లాంచ్‌ కానుంది. అదే రెడ్‌మీ 11 5జీ స్మార్ట్‌ ఫోన్. రెడ్‌మీ 10 నెక్ట్స్‌ వర్షన్‌గా ఇది రానుంది. అయితే ఈ ఫోన్‌కు ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటారా.. రెడ్‌మీ నంబర్‌ సిరీస్‌లో ఇదే మొదటి 5జీ ఫోన్.. లీకైన సమాచారం ప్రకారం..ఈ ఫోన్‌ ఫీచర్స్‌, కాస్ట్‌ ఎంతుందో చూద్దామా..!

రెడ్‌మీ 11 5జీ ధర (అంచనా)

ఈ ఫోన్ ధర మనదేశంలో రూ.13,999 నుంచి ప్రారంభం కానుందని టెక్‌ నిపుణుల అంచనా.. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. జూన్ నెలాఖరులో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉందట. రెడ్‌మీ ఈ స్మార్ట్ ఫోన్ వివరాలను అధికారికంగా ఇంకా వెల్లడించలేదు.

కెమెరా ముచ్చట ఏంటి..?

కెమెరాల విషయానికి వస్తే… ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా… దీంతోపాటు 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ కూడా ఉండనుంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా అందించనున్నారు.

రెడ్‌మీ 11 5జీ స్పెసిఫికేషన్లు…

అంచనా ప్రకారం.. ఈ ఫోన్ ఏ ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుందో ఇంకా తెలియరాలేదు.
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంను అందించే అవకాశం ఉంది.
మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ ఇందులో ఉండనుంది.
4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ అందించనున్నారు.
స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం ఉంది. 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లే ఉండనుంది.
ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండనుంది.
500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.

మొత్తానికి బడ్జెట్‌లో 5జీ స్మార్ట్‌ ఫోన్‌ను రెడ్‌మీ తీసుకువస్తుంది. ఇప్పటికే మార్కెట్‌లో రెడ్‌మీకి మంచి డిమాండ్‌ ఉంది. ఈ ఫోన్‌ కష్టమర్స్‌ను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news