Tecno Phantom X.. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్.. ఫీచర్స్ ఇవే..!

-

మార్కెట్ లో స్మార్ట్ ఫోన్లకు కొదవే లేదు.. మన బడ్జెట్ లోనే బోలెడు రకాలు ఉన్నాయి. కొన్ని అయితే మీరు వినే ఉండరు. ఎప్పడూ వాడే కంపేనీలే కాకుండా.. అప్పుడప్పుడు కొత్త వాటిపై కూడా ఓ కన్నేయాలి.. టెక్నోఫాంటం ఎక్స్ స్మార్ట్ ఫోన్ మన దేశంలో లాంచ్ అయింది. ఇది పెద్దగా అందరికి తెలిసి ఉండకపోవచ్చు. 25 వేలలో ఫోన్ కొందామనుకునే వాళ్లు.. ఈ ఫోన్ ఫీచర్స్ కూడా ఓసారి చూడండి..

టెక్నో ఫాంటం ఎక్స్ ధర..

ఈ స్మార్ట్ ఫోన్‌లో ఒక్క వేరియంట్ మాత్రమే లాం

చ్ అయింది. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.25,999గా ఉంది.

ఐస్‌ల్యాండ్ బ్లూ, సమ్మర్ సన్‌సెట్ కలర్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

మే 4నుంచి దీని సేల్ జరగనుంది. ఈ ఫోన్ కొనుగోలు చేస్తే రూ.2,999 విలువైన బ్లూటూత్ స్పీకర్ ఉచితంగా పొందవచ్చు.

టెక్నో ఫాంటం ఎక్స్ స్పెసిఫికేషన్లు..

ఆండ్రాయిడ్ 11 ఆధారిత IOS 8.0 ఆపరేటింగ్ సిస్టంపై టెక్నో ఫాంటం ఎక్స్ పనిచేయనుంది.

6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ కర్వ్‌డ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 19.5:9గానూ, రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గానూ ఉంది.

డిస్‌ప్లే ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్యానెల్ కూడా అందించారు.

ఇక బ్యాటరీ విషయానికి వస్తే..దీని బ్యాటరీ సామర్థ్యం 4700 ఎంఏహెచ్ కాగా… 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. కేవలం 20 నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్ ఎక్కనుంది.

మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. దీని మందం 0.87 సెంటీమీటర్లుగా ఉంది.

12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు.

ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉంటాయి.. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్, 8 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు రెండు కెమెరాలు అందించారు. 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి.

4జీ వోల్టే, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో ఉన్నాయి.

వివో వీ23ఈ 5జీ, ఒప్పో ఎఫ్21 ప్రో, శాంసంగ్ గెలాక్సీ ఎం53 5జీలతో ఈ ఫోన్ పోటీ పడనుంది.

Read more RELATED
Recommended to you

Latest news