నా భార్యకు కడుపొచ్చింది.. పక్కింటోడే కారణం.. అందుకే..

భార్యపై అనుమానంతో విచక్షణరహితంగా ప్రవర్తించాడో వ్యక్తి.. భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే నేపంతో ఓ యువకుడి తల్లిదండ్రులను దారుణంగా నరికి చంపాడో కిరాతకుడు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రెండో పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి అతని భార్యతో సంతోషంగా కాపురం చేస్తున్నాడు. వ్యవసాయం చేస్తున్న భర్త ప్రతిరోజు ఉదయం పొలం దగ్గరకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చేవాడు. అయితే.. 35 సంవత్సరాల వయసు ఉన్న భార్య గర్బవతి కావడంతో.. భార్యకు ప్రస్తుతం 8వ నెల. తన రెండో భార్య పక్కింటి యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, యువకుడి కారణంగా నా భార్య తల్లి అయ్యిందని భర్తకు అనుమానం పెరిగిపోయింది.

Man attacks uncle over having illegal affair with aunt in Ranchi

అంతేకాకుండా.. భార్య కూడా పదేపదే పక్కింటి యువకుడితో ఎక్కువగా మాట్లాడుతుండటంతో భర్త అనుమానం ఇంకా ఎక్కువైపోయింది. దీంతో.. రాత్రి సదరు భర్త కొడవలితో అతని భార్య, అత్త మీద దాడి చేశాడు. ఇదే సమయంలో తన భార్య ప్రియుడు అనుకుంటున్న యువకుడి తల్లిదండ్రులను దారుణంగా నరికి చంపేశాడు. అడ్డువెళ్లిన మేనల్లుడు, మరో బంధువును కొడవలితో ఇష్టం వచ్చినట్లు నరికేసిన భర్త నడిరోడ్డు మీద కొడవలిని చేతిలో పట్టుకుని కూర్చుని భార్య ప్రియుడిని కూడా చంపడానికి ఎదురు చూడటం ఆ ప్రాంతంలో సంచలన సృష్టిస్తోంది.