Vivo T1 బడ్జెట్ స్మార్ట్ ఫోన్ .. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్..

-

చైనీస్ ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో మన దేశంలో కొత్త బడ్జెట్ 4జీ ఫోన్ ను విడుదల చేసింది.. వివో టీ1. ఈ నెలాఖరు లోపు కొనుగోలు చేస్తే.. ఆఫర్లు కూడా ఉన్నాయి. మరీ ఈ ఫోన్ ధర ఎంత, బ్యాటరీ సామర్ధ్యం ఎట్లా , కెమేరా ముచ్చటేంది ఇవన్నీ చూద్దామా..!

వివో టీ1 44W ధర

ఈ స్మార్ట్ ఫోన్‌లో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.
4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,499గా ఉంది.
టాప్ ఎండ్ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ.15,999గా నిర్ణయించారు.

ఐస్ డాన్, మిడ్ నైట్ గెలాక్సీ, స్టారీ స్కై కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈరోజు నుంచే ఈ ఫోన్ సేల్ ప్రారంభం కానున్నాయి. మే 31వ తేదీ లోపు బ్యాంకు కార్డుల ద్వారా దీన్ని కొనుగోలు చేస్తే రూ.1,500 వరకు తగ్గింపు పొందవచ్చు.. అంటే రూ.12,999కే దీన్ని తీసుకోవచ్చనమాట.

వివో టీ1 44W హైలెట్స్..

6.44 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు.
8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ అందించారు. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 1 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.
వివో టీ1 44W బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 44W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టంపై వివో టీ1 44W పనిచేస్తుంది..
ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌పై వివో టీ1 44W పని చేయనుంది.
దీని మందం 0.84 సెంటీమీటర్లుగానూ… బరువు 182 గ్రాములుగానూ ఉంది.
4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉన్నాయి.
యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా ఇందులో అందించారు. ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ ఫోన్ పక్కభాగంలో ఉంది.

కెమేరా ఫీచర్స్..

ఈ ఫోన్ కు వెనకవైపు మూడు కెమేరాలు అందించారు. 64 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్ బొకే కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కూడా ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ అందించారు.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news