మొబైల్‌లో నంబర్ సేవ్‌ చేసుకోకుండా… వాట్సాప్ లో మెసేజ్ ఎలా చెయ్యచ్చంటే..?

-

ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ని ఉపయోగిస్తున్నారు. వాట్సాప్ ద్వారా ఈజీగా మనం సందేశాలను పంపుకోవచ్చు. అదే విధంగా ఫొటోలను, వీడియోలని కూడా ఈజీగా షేర్ చేసుకోవచ్చు. అయితే వాట్సాప్ సంస్థ రోజు రోజుకి కొత్త ఫీచర్లను తీసుకు వస్తోంది. జనరల్ గా మనం వాట్సాప్ లో ఎవరికైనా మెసేజ్ చేయాలంటే మొదట వారి యొక్క మొబైల్ నెంబర్ ని మనం ఫోన్లో సేవ్ చేసుకుని ఆ తర్వాత వాళ్లకి మెసేజ్ పంపుతూ ఉంటాము.

అయితే థర్డ్ పార్టీ యాప్స్ ని ఉపయోగించి వ్యక్తి నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్ లో మెసేజ్ చేసే అవకాశం వాట్సాప్ ఇస్తోంది. కానీ వీటిని ఉపయోగించడం వల్ల మన యొక్క సెక్యూరిటీ కి ఇబ్బంది వస్తుంది. ఇలా చేయడంవల్ల నిజానికి మనం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే మరి వాట్సాప్ లో మనం ఎలా మెసేజ్ పెట్టాలి వాళ్ళ యొక్క కాంటాక్ట్ ని సేవ్ చెయ్యకుండా మెసేజ్ చేయొచ్చా అనేదాని గురించి చూద్దాం.

ముందుగా మీ ఫోన్‌లోని బ్రౌజర్‌ని ఓపెన్ చేయండి.
ఇప్పుడు మీరు http://wa.me/xxxxxxxxxx ఈ లింక్‌ని కాపీ చేసి యూఆర్‌ఎల్‌ అడ్రస్‌ బార్‌లోపేస్ట్‌ చేయాలి.
ఇక్కడ xxxxxxxxxx ప్లేస్ లో మన దేశం కోడ్‌ 91తో పాటు మీరు మెసేజ్‌ పంపాలనుకున్న మొబైల్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి.
ఉదాహరణకు http://wa.me/919911111111 ఎంటర్‌ చేయాలి.
మీరు వ్యక్తిగత ఫోన్‌ నంబర్‌తో గ్రీన్‌ కలర్‌తో మెసేజ్‌ బటన్‌తో ఒక వాట్సాప్‌ పేజీ ఓపెన్‌ అవుతుంది.
గ్రీన్‌ కలర్‌ మెసేజ్‌బటన్‌పై క్లిక్‌ చేస్తే మీరు వాట్సాప్‌ కి రీడైరెక్ట్ అవుతుంది.
ఇలా మెసేజ్‌ చేయచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news