బెస్ట్‌ 5G ఫోన్‌ రూ. 15 వేల లోపే కావాలా..? లిస్ట్‌ ఇదిగో..!!

-

ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లో ఆఫర్లు ఉన్నాయి. కొత్త ఫోన్‌ కొనాలనుకునేవాళ్లకు ఇదే మంచి సమయం. పాత ఫోన్‌ను ఎక్సేంజ్‌ చేసుకుని కావాల్సిన ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. అయితే మన బడ్జెట్‌ 15 వేలే.. 5G ఫోన్ కావాలి..? ఈ రేంజ్‌లో ఏం ఫోన్లు వస్తాయి అని ఆలోచిస్తున్నారా..? టెన్షన్‌ ఎందుకు.. 15వేల లోపు వచ్చే బెస్ట్‌ 5G మొబైల్స్‌ ఇవే..! ఓ లుక్కేసేయండి.!

రెడ్‌మీ 12 5జీ స్మార్ట్‌ఫోన్

ఈ రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ ధర రూ.14,999గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.79 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, ఇది 550 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. రెడ్‌మీ 12 5జీ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్ ఉంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ కూడా ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.

ఐకూ జెడ్6 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్

ఈ ఐకూ ఫోన్ ధర రూ.14,499గా ఉంది. ఐకూ జెడ్6 లైట్ 5జీ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను కూడా అందించారు. ఐకూ జెడ్6 లైట్ 5జీ స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఇది 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో లాంచ్ అయింది. ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ స్మార్ట్‌ఫోన్

ఈ శాంసంగ్ ఫోన్ ధర రూ.13,990గా ఉంది. ఈ ఫోన్ 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. శాంసంగ్ సొంత ఎక్సినోస్ 1330 చిప్‌సెట్‌తో వస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీలో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా, 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ పవర్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది, దీనితో పాటు కంపెనీ రెండు సంవత్సరాల OS అప్‌డేట్స్‌ను, నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ వారంటీని ఇచ్చింది.

search హానర్ 90 5జీ స్మార్ట్ ఫోన్‌పై అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భారీ ఆఫర్‌ను అందించారు. ఏకంగా రూ.11 వేల తగ్గింపును search హానర్ అందించింది. ఈ ఫోన్‌ను రూ.26,999కే ప్రస్తుతం కొనుగోలు చేయవచ్చు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news