అమెరికాలో లాంచ్‌ అయిన Moto Edge 2022.. స్పెసిఫికేషన్స్‌ ఇవే..!!

-

మోటొరోలా నుంచి కొత్త ఫోన్‌ అమెరికాలో లాంచ్ అయింది. అదే మోటో ఎడ్జ్ 2022 స్మార్ట్ ఫోన్. దీని ధర 40 వేల వరకూ ఉంది. 50 మెగా పిక్సెల్ కెమెరాతో ఫోన్‌ లాంచ్‌ అయింది. త్వరలోనే మన దేశంలో కూడా విడదలయ్యే అవకాశం ఉంది. ఇంతకీ ఫోన్‌ ఫీచర్స్‌ ఎలా ఉన్నాయంటే..

మోటొరోలా ఎడ్జ్ 2022 ధర..

దీని ధరను 499.99 డాలర్లుగా అంటే సుమారు రూ.40,000గా నిర్ణయించారు. కేవలం బ్లాక్ కలర్ ఆప్షన్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

మోటొరోలా ఎడ్జ్ 2022 స్పెసిఫికేషన్లు..

ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు.
దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 144 హెర్ట్జ్‌గా ఉంది.
డిస్‌ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9 కాగా, హెచ్‌డీఆర్10+ సపోర్ట్ కూడా ఉంది.
సెంట్రల్ పంచ్ హోల్ కటౌట్, అండర్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇందులో అందించారు.
మీడియాటెక్ డైమెన్సిటీ 1050 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.
30W టర్బో పవర్ వైర్డ్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.
ఆండ్రాయిడ్ 12 ఆధారిత మై యూఎక్స్ ఇంటర్‌ఫేస్‌ను ఈ ఫోన్‌లో అందించారు.
15W వైర్‌లెస్ చార్జింగ్, 5W రివర్స్ చార్జింగ్‌ను మోటొరోలా ఎడ్జ్ 2022 సపోర్ట్ చేయనుంది.
ఐపీ52 వాటర్ రెసిస్టెన్స్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.
డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, మూడు మైక్రో ఫోన్లను మోటొరోలా ఎడ్జ్ 2022లో అందించారు.
ఎంఎం వేవ్, సబ్-6గిగా హెర్ట్జ్ 5జీ కనెక్టివిటీని ఇది సపోర్ట్ చేయనుంది.
దీని మందం 0.8 సెంటీమీటర్లు కాగా, బరువు 170 గ్రాములుగా ఉంది.

కెమెరా క్వాలిటీ..

ఇక కెమెరాల విషయానికి వస్తే… ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, డెప్త్ సెన్సార్ కూడా అందించారు. ఇక సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news