త్వరలో లాంచ్‌ కానున్న Realme C30s స్మార్ట్‌ ఫోన్..!

-

రియల్‌మీ నుంచి సీ సిరీస్‌లో భాగంగా మరో కొత్త ఫోన్‌ త్వరలో లాంచ్‌ కానుంది. రియల్‌మీ సీ30ఎస్. దీని డిజైన్, స్పెసిఫికేషన్లను కంపెనీ ఇప్పటికే టీజ్ చేసింది. రియల్‌మీ సీ30 తరహాలోనే దీని లుక్, డిజైన్ ఉన్నాయి. ఫోన్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
ఈ ఫోన్ ధర రూ.15 వేలలోపే ఉండనుంది. రియల్‌మీ సీ30ఎస్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో సెప్టెంబర్ 14వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. దీనికి కావాల్సిన ప్రత్యేకమైన ల్యాండింగ్ పేజీని కూడా కంపెనీ అధికారిక వెబ్ సైట్లో పోస్ట్‌ చేసింది.. ఈ పేజీ ప్రకారం ఈ ఫోన్‌లో 6.5 అంగుళాల డిస్‌ప్లేను అందించనున్నారు. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 88.7 శాతంగా ఉంది.
పేరు తెలియని ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఈ ఫోన్‌లో అందించారు. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నట్లు సమాచారం.. బయోమెట్రిక్ యాక్సెస్ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. కేవలం ఒక్క సెకనులోనే ఈ ఫోన్ అన్‌లాక్ అవుతుందని రియల్‌మీ చెబుతోంది..3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, మైక్రోఫోన్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, స్పీకర్ గ్రిల్ ఇందులో ఉన్నాయి. దీని లుక్ చూడటానికి రియల్‌మీ సీ30 తరహాలోనే ఉంది. బ్లాక్, బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవవచ్చు. దీని ధర వివరాలు తెలియాల్సి ఉంది.
రియల్‌మీ సీ30 బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సోమవారమే లాంచ్ అయింది. ఇందులో రెండు వేరియంట్లు ఉన్నాయి. వీటిలో 2 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.7,499 కాగా, 3 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.8,299గా నిర్ణయించారు. బాంబూ గ్రీన్, డెనిమ్ బ్లాక్, లేక్ బ్లూ కలర్ వేరియంట్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్) ఆధారిత రియల్‌మీ యూఐ గో ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లే అందించారు. ఆక్టాకోర్ యూనిసోక్ టీ612 ప్రాసెసర్‌ను అందించారు. ఫోన్ వెనకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news