ఈ నెల 25 విడుదలకానున్న Tecno Pova 3.. ముందే లీకైన ఫీచర్లు..!

మార్కెట్ లో.. స్మార్ట్ ఫోన్లకు కొదవే లేదు.. మన దగ్గర ఉన్న బడ్జెట్ లోనే బోలెడు ఫోన్లు వస్తున్నాయి. వచ్చేవి వస్తూనే ఉన్నాయి..ఫ్లాప్ అయిపోయేవి పోతునే ఉన్నాయి. క్లిక్ అయిన ఆ నాలుగు ఐదు కంపెనీలే ఎప్పుడూ కష్టమర్స్ మైండ్ లో గుర్తుంటాయి. అంతకు మించి కంపెనీలు మార్కెట్ లో ఉన్నాయి. టెక్నో పోవా 3 స్మార్ ఈ నెల 25న గ్లోబల్ లాంచ్ కానుంది.. దీని ధర, ఫీచర్స్ ఇప్పటికే లీక్ అయ్యాయి.
లీకైన సమాచారం ప్రకారం..టెక్నో పోవా ఫోన్ ధర 8,999 ఫిలిప్పీన్స్ పెసోల (మనదేశ కరెన్సీలో రూ.13,499) నుంచి 9,399 ఫిలిప్పీన్స్ పెసోల (సుమారు రూ.13,999) మధ్య ఉండనుంది. ఫోటోలు కూడా ఇప్పటికే లీక్ అయ్యాయి.. ఎలక్ట్రిక్ బ్లూ, టెక్ సిల్వర్, ఎకో బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. ఫోన్ ముందువైపు మధ్యభాగంలో సెల్ఫీ కెమెరా ఉండనుంది. దీంతోపాటు కుడివైపు వాల్యూమ్ రాకర్లు, ఎడమవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది.

టెక్నో పోవా 3 స్పెసిఫికేషన్లు (అంచనా)..

ఈ ఫోన్‌లో 6.9 అంగుళాల ఫుల్ హెచ్‌డీ + డాట్ ఇన్ డిస్‌ప్లే ఉండనుంది.
స్క్రీన్ రిజల్యూషన్ 1080 × 2460 పిక్సెల్స్‌గానూ, రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గానూ ఉండనుంది.
ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
4 జీబీ + 64 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఉన్న వేరియంట్లు ఉండనున్నాయి.
మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్ కూడా ఇందులో ఉండే అవకాశం ఉంది.
ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా, డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉండనుంది.
ఈ ఫోన్ మందం 0.94 సెంటీమీటర్లుగా ఉండనుంది.

కెమేరా క్వాలిటీ..

ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమేరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా… దీంతోపాటు మరో రెండు సెన్సార్లు అందించనున్నారు. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంతో ఈ ఫోన్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.
7000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని ఇందులో అందించనున్నారు.
33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.