లాంచ్‌ అయిన Redmi 10A Sport స్మార్ట్‌ ఫోన్.. రూ. 11వేలకే 6GB+128GB స్టోరేజ్

Redmi నుండి కొత్త ఫోన్‌ ఇండియాలో లాంచ్‌ అయింది. Redmi 10A స్పోర్ట్‌ ఫోన్‌ను కంపెనీ విడుదల చేసింది. ఇది ఒక బడ్జెట్‌ ఫోన్.. ప్రస్తుతం బడ్జెట్‌ ఫోన్లదే హావా అయింది. పదిహేను వేలల్లోనే బోలెడు ఫోన్లు మార్కెట్‌లో ఉంటున్నాయి. కష్టమర్స్‌ కూడా వీటిని కొనేందుకు ఇష్టపడుతున్నారు.
రెడ్‌మీ 10ఏ స్పోర్ట్ ధర..
రెడ్‌మీ 10ఏ స్పోర్ట్‌లో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది.
6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ వేరియంట్ ధర రూ.10,999గా నిర్ణయించారు.
చార్‌కోల్ బ్లాక్, స్లేట్ గ్రే, సీ బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
అమెజాన్ ఇండియా, ఎంఐ స్టోర్లలో రెడ్‌మీ 10ఏ స్పోర్ట్ కొనుగోలు చేయవచ్చు.
రెడ్‌మీ 10ఏ స్పోర్ట్ స్పెసిఫికేషన్లు..
ఇందులో 6.53 అంగుళాల వాటర్ డ్రాప్ నాచ్ తరహా హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు.
దీని స్క్రీన్ రిజల్యూషన్ 1600 x 720 పిక్సెల్స్‌గా ఉంది. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది.
మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్‌పై రెడ్‌మీ 10ఏ స్పోర్ట్ పనిచేయనుంది.
6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉన్నాయి.
స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా ఇంకా పెంచుకునే అవకాశం ఉంది.
ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.
మైక్రో యూఎస్‌బీ పోర్టును అందించారు. ఫింగర్ ప్రింట్ ఫోన్ వెనకవైపు ఉంది.
3.5 ఎంఎం ఆడియో జాక్ ద్వారా ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకోవచ్చు.
డ్యూయల్ సిమ్, 4జీ, వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్, ఏజీపీఎస్, బైదు కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
దీని మందం 0.9 సెంటీమీటర్లు కాగా, బరువు 194 గ్రాములుగా ఉంది.
కెమెరా క్వాలిటీ..
రెడ్‌మీ 10ఏ స్పోర్ట్‌లో వెనకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 10W ఫాస్ట్ చార్జింగ్‌ను రెడ్‌మీ 10ఏ స్పోర్ట్ సపోర్ట్ చేయనుంది.