టీచర్‌పై రేప్.. పోలీసులకు చెప్పిందని.. కిడ్నాప్‌ చేసి

ఓ స్కూల్‌కు చెందిన మేనేజర్‌ భర్త మహిళ ఉపాధ్యాయురాలిపై విచక్షణ రహితంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా సదరు టీచర్‌ను రేప్‌ చేస్తూ వీడియో చిత్రీకరించాడు. ఈ విషయాన్ని బయటపెడితే నగ్నవీడియోలు బయట పెడుతానని బెదిరించాడు. అయినప్పటికీ సదరు టీచర్‌ పోలీసులను ఆశ్రయించడంతో ఆ టీచర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేసిన ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని తిల్హర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన వ్యక్తి ఏదో పని నిమిత్తం ఉపాధ్యాయురాలిని షాజహాన్‌పూర్‌కు తీసుకెళ్లి హోటల్‌లో అత్యాచారం చేశాడని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (రూరల్) సంజీవ్ బాజ్‌పాయ్ ఎఫ్‌ఐఆర్‌లో తెలిపారు.

1,101 Raped Stock Photos and Images - 123RF

ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే కుటుంబ సభ్యులను చంపేస్తానని, వీడియోను వైరల్ చేస్తానని బెదిరిస్తూ నిందితులు ఆమెను పదేపదే చిత్రహింసలకు గురిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రితం జరిగిన విషయాన్ని మహిళ కుటుంబసభ్యులకు చెప్పడంతో వారు ఆ వ్యక్తి ఇంటికి వెళ్లారు. అయినా బెదిరించి వెనక్కి పంపారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకున్న నిందితులు సదరు మహిళను ఆమె ఇంట్లోనుంచే కిడ్నాప్‌ చేసినట్టు ఎస్పీ తెలిపారు. ఈ మేరకు పోలీసులు గాలింపు చేపట్టారు. పలు సెక్షన్ల కింద బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టుగా తెలిపారు పోలీసులు.