సెల్‌ ఫోన్‌లో డ్రోన్‌ కెమెరా తీసుకురానున్న వీవో.. కెమెరా ఫోన్లలో మరో విప్లవమే..!

-

వ్యాపారం చేయగానే సరిపోదు..మనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలి అంటారు.. మార్కెట్‌లో అన్నీ ఫోన్లే.. అన్నీ మన బడ్జెట్‌లోనే ఉన్నాయి. మరి కష్టమర్స్‌ మన కంపెనీ ఫోన్‌నే ఎందుకు తీసుకోవాలి..? ఆ ఫోన్లో సంథింగ్‌ ఏదో స్పెషల్‌ ఉంటేనే వినియోగదారులు చూస్తారు. ఇదే ఉద్దేశంతో ప్రస్తుతం కంపెనీలన్నీ భిన్నమైన ఫీచర్‌తో ఫోన్‌ ఇవ్వాలని రూపొందిస్తున్నాయి. ఫోన్ అంటే స్టోరేజ్‌, కెమెరాదే ముఖ్యమైన పాత్ర. ఇవి ఎంత ఎక్కువ ఉంటే జనాలు అంత ఇష్టపడతారు. కెమెరా ఫోన్లలో మరో విప్లవం తీసుకొస్తోంది వివో సంస్థ. ఏకంగా సెల్ ఫోన్ కెమెరాలో డ్రోన్ కెమెరా పెట్టేస్తోంది.
వీవో దీనికి సంబందించి డిజైన్.. టెస్టింగ్ కూడా పూర్తయింది. కాన్సెప్ట్ వీడియోను కూడా రిలీజ్ చేసింది. టాప్ యాంగిల్ నుంచి ఫోటో తీసుకోవాలన్నా.. సెల్ఫీ తీసుకోవాలన్నా ఇక సెల్ఫీ స్టిక్ అవసరం ఉండదు. ఈ ఫోన్ డ్రోన్ కెమెరానే పైకి వెళ్లి షూటింగ్ చేస్తుంది. దానికి తగ్గట్లుగా ఫోన్‌లోనే సెట్టింగ్ పెట్టుకోవచ్చు. మీకు డౌట్‌ రావొచ్చు.. డ్రోన్‌ కెమెరా అంటే..ఫోన్‌ కూడా పైకి ఎగురుతుంది.. అప్పుడు ఫోటో ఎవరు తీస్తారు అని.. డ్రోన్ కెమెరా అంటే.. ఫోన్ మొత్తం పైకి ఎగరదు. కేవలం కెమెరా మాత్రేమే పైకి వెళ్తుంది. దానికి సంబంధించిన వివో విడుదల చేసిన ఫోన్ కాన్సెప్ట్ కూడా ఆకట్టుకుంటోంది.
వివో ఫోన్‌లో అంతర్బాగంగా ఉండే.. చిన్న డ్రోన్ కెమెరాలకు నాలుగు ఫ్యానలు ఉన్నాయి. మనం డ్రోన్ కెమెరా మోడ్‌లోకి వెళ్లి ఆన్ చేయగానే ఆటోమేటిక్‌గా కెమెరా బయటకు వచ్చి.. మనం ఇచ్చిన కమాండ్‌లో ఫోటోలు తీస్తుంది. ఇందులో రెండు వందల మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. అరు వేల ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఫోన్ల కన్నా అద్భుతమైన ఫీచర్లు ఉంటాయి.
ఈ ఫోన్‌ను ఎప్పుడు ఇండియాలో మార్కెట్లోకి విడుదల చేస్తారో ఇంకా కంపెనీ స్పష్టం చేయలేదు. కానీ ఆ ఫోన్‌కు సంబంధించిన వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివో సంస్థ ఫ్లాగ్ షిప్ ఫోన్లను తయారుచేయడంలో ముందుంది. ఈ డ్రోన్ ఫోన్లలో ఇదే మొదటిది.
ఇతరకంపెనీలు మరింత అడ్వాన్స్‌గా పరిశోధనలు చేసి.. ఫోన్లలో సరికొత్త విప్లవాన్ని సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివో తెచ్చిన ఈ ఫీచర్ సక్సస్‌ అయితే నెక్ట్స్‌ వచ్చే ఫోన్లు ఇంతకంటే అడ్వాన్స్‌డ్‌గా ఉంటాయి. ఇక ఫోన్లో డ్రోన్స్‌ లెవలే మారిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news