మోటో జి10 ప‌వ‌ర్‌, మోటో జి30 ఫోన్ల‌ను లాంచ్ చేసిన మోటోరోలా.. ఫీచ‌ర్లు, ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..?

-

మోటోరోలా కంపెనీ మోటో జి10 ప‌వ‌ర్, మోటో జి30 పేరిట రెండు నూత‌న స్మార్ట్ ఫోన్ల‌ను భార‌త్ లో మంగ‌ళ‌వారం విడుద‌ల చేసింది. మోటో జి10 ప‌వ‌ర్ ఫోన్లో 6.5 ఇంచుల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగ‌న్ 460 ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 48 మెగాపిక్స‌ల్ క్వాడ్ రియ‌ర్ కెమెరాలు ఉన్నాయి. మోటో జి30లో 6.5 ఇంచుల డిస్‌ప్లే, 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌, స్నాప్ డ్రాగ‌న్ 662 ప్రాసెస‌ర్, 4జీబీ ర్యామ్‌, 64 మెగాపిక్స‌ల్ క్వాడ్ రియ‌ర్ కెమెరాలు ఉన్నాయి.

moto g10 power and g30 smart phones launched

ఈ ఫోన్ల‌లో ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌ను అందిస్తున్నారు. ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్లు వెనుక భాగాల్లో వీటికి ఉన్నాయి. ఐపీ 52 వాట‌ర్ రెసిస్టెన్స్‌ను అందిస్తున్నారు. జి30 ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఉండ‌గా, జి10 ఫోన్‌లో 6000 ఎంఏహెచ్ బ్యాట‌రీని ఏర్పాటు చేశారు.

మోటో జి10 ప‌వ‌ర్ ఫీచ‌ర్లు…

* 6.5 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1600 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 460 ప్రాసెస‌ర్‌, 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌, 1టీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
* హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 11
* 48, 8, 2, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా
* గూగుల్ అసిస్టెంట్ బ‌ట‌న్‌, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్
* ఐపీ 52 వాట‌ర్ రెసిస్టెన్స్‌, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0
* యూఎస్‌బీ టైప్ సి, 6000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 20 వాట్ల ట‌ర్బో ప‌వ‌ర్ చార్జింగ్

మోటో జి30 ఫీచ‌ర్లు

* 6.5 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1600 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూషన్, 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్
* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 662 ప్రాసెస‌ర్‌, 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌, 1టీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
* హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 11, 64, 8, 2, 2 మెగాపిక్స‌ల్ కెమెరాలు
* 13 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా, గూగుల్ అసిస్టెంట్ బ‌ట‌న్
* ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఐపీ 52 వాట‌ర్ రెసిస్టెన్స్‌, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ
* బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి
* 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 20 వాట్ల టర్బో ప‌వ‌ర్ చార్జింగ్

మోటో జి10 ప‌వ‌ర్ స్మార్ట్ ఫోన్ అరోరా గ్రే, బ్రీజ్ బ్లూ క‌లర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌ల కాగా ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో మార్చి 16వ తేదీ నుంచి రూ.9,999 ధ‌ర‌కు విక్ర‌యించ‌నున్నారు. మోటో జి30 ఫోన్ డార్క్ పెర‌ల్‌, పాస్ట‌ల్ స్కై క‌ల‌ర్ ఆప్ష‌న్లలో విడుద‌ల కాగా ఈ ఫోన్‌ను రూ.10,999 ధ‌ర‌కు మార్చి 17 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్ర‌యిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news