అత్యంత చెత్త పాస్‌వ‌ర్డ్‌ల జాబితా విడుద‌ల‌.. అవేమిటంటే..?

-

ఈ-మెయిల్‌, సోష‌ల్ మీడియా అకౌంట్‌, బ్యాంక్ అకౌంట్‌.. ఇలా ప్ర‌స్తుతం మ‌నం అనేక ర‌కాల అకౌంట్ల‌కు యూజ‌ర్‌నేమ్స్‌, పాస్‌వ‌ర్డ్‌ల‌ను ఉప‌యోగిస్తున్నాం. అయితే కొంద‌రు గుర్తు పెట్టుకునేందుకు చాలా సుల‌భంగా ఉంటుంద‌ని చెప్పి కామ‌న్‌గా ఉప‌యోగించే పాస్‌వ‌ర్డ్‌ల‌ను త‌మ అకౌంట్ల‌కు పెట్టుకుంటుంటారు. కానీ వాటిని సుల‌భంగా క్రాక్ చేసి అకౌంట్ల‌ను ఈజీగా హ్యాక్ చేయ‌వ‌చ్చ‌ని సెక్యూరిటీ కంపెనీలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే 2020 సంవ‌త్స‌రానికి గాను నార్డ్‌పాస్ సంస్థ అత్యంత చెత్త పాస్‌వ‌ర్డ్‌ల జాబితాను విడుద‌ల చేసింది.

nordpass revealed most worst passwords list of 2020

నార్డ్ పాస్ విడుద‌ల చేసిన చెత్త పాస్ వ‌ర్డ్‌ల జాబితాలో 123456 మొద‌టి స్థానంలో నిల‌వ‌డం విశేషం. గ‌త కొన్నేళ్లుగా ఆ సంస్థ విడుద‌ల చేస్తున్న అత్యంత చెత్త పాస్‌వ‌ర్డ్‌ల జాబితాలో ఇదే మొద‌టి స్థానంలో నిలుస్తూ వ‌స్తోంది. 2015లో 123456 పాస్ వ‌ర్డ్ స‌ద‌రు జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. త‌రువాత password అనే ప‌దం మొద‌టి స్థానంలో నిలిచింది. ఇక ఇప్పుడు మ‌ళ్లీ కొన్నేళ్ల నుంచి 123456 అనే పాస్‌వ‌ర్డ్ చెత్త పాస్‌వ‌ర్డ్ ల జాబితాలో మొద‌టి స్థానంలో ఉంటూ వ‌స్తోంది.

ఇక నార్డ్ పాస్ విడుద‌ల చేసిన స‌ద‌రు జాబితా ప్ర‌కారం… టాప్ 20 చెత్త పాస్‌వ‌ర్డ్‌ల వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి.

123456, 123456789, picture1, password, 12345678, 111111, 123123, 12345, 1234567890, senha, 1234567, qwerty, abc123, Million2, 000000, 1234, iloveyou, aaron431, password1, qqww1122

కాగా aaron431 అనే పాస్‌వ‌ర్డ్‌ను మొత్తం 90వేల మంది ఉప‌యోగిస్తున్నార‌ని స‌ద‌రు సంస్థ వెల్ల‌డించింది. అలాగే chocolate అనే పాస్‌వ‌ర్డ్‌ను 21,409 మంది, pokemon అనే పాస్‌వ‌ర్డ్‌ను 37వేల మంది ఉప‌యోగిస్తున్నార‌ని నార్డ్‌పాస్ తెలియ‌జేసింది. ఈ క్ర‌మంలో యూజ‌ర్లు చాలా క‌ఠిన‌మైన పాస్‌వ‌ర్డ్‌ల‌ను త‌మ అకౌంట్ల‌కు సెట్ చేసుకోవాల‌ని, లేదంటే హ్యాక‌ర్లు సుల‌భంగా అకౌంట్ల‌ను క్రాక్ చేసి వాటిల్లోని స‌మాచారాన్ని చోరీ చేయ‌డమే కాకుండా, బ్యాంక్ అకౌంట్లు అయితే డ‌బ్బులు కూడా కొట్టేసే ప్ర‌మాదం ఉంద‌ని సెక్యూరిటీ నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news