చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు షియోమీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై వినియోగదారులు వాట్సాప్ ద్వారా షియోమీ ఫోన్లు, ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. ఇందుకు గాను ప్రత్యేకంగా ఓ వాట్సాప్ నంబర్‌ను షియోమీ ప్రవేశపెట్టింది. 8861826286 అనే నంబర్‌ను వినియోగదారులు కాంటాక్ట్‌లలో సేవ్ చేసుకుని దానికి మెసేజ్‌లను పంపితే వాట్సాప్ ద్వారా షియోమీ ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది.
ఇక వినియోగదారులు తమకు కావాలనుకునే షియోమీ ప్రొడక్ట్‌ను ఆర్డర్ చేయగానే.. వారికి సమీపంలో ఉన్న లోకల్ స్టోర్స్ నుంచి సదరు ప్రొడక్ట్స్ వారి ఇంటికే డెలివరీ అవుతాయి. ఇందుకు గాను షియోమీ కొత్తగా ఎంఐ కామర్స్ అనే ప్లాట్‌ఫాంను అందుబాటులోకి తెచ్చింది. ఇది వినియోగదారులను, లోకల్ స్టోర్స్‌ను, షియోమీ గేట్‌వేను ఒకే వేదికపై కలుపుతుంది. ఇక ఆర్డర్ చేసిన వస్తువులకు గాను వినియోగదారులు ఆన్‌లైన్‌లోనే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇక వస్తువులను అత్యంత సురక్షితంగా, అన్ని నిబంధనలను పాటిస్తూ.. డెలివరీ చేస్తారు.
కాగా దేశంలో ప్రస్తుతం గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఈ-కామర్స్ సంస్థలు పనిచేసేందుకు అనుమతి ఇచ్చారు కనుక.. అవే జోన్లలోనూ వినియోగదారులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని షియోమీ తెలిపింది.