సోనీ ఆడియో డేస్ 2021 సేల్‌.. భారీ త‌గ్గింపు ధ‌ర‌ల‌కు సోనీ ఆడియో ప్రొడ‌క్ట్స్‌..!

ప్ర‌ముఖ ఎల‌క్ట్రానిక్స్ త‌యారీ కంపెనీ సోనీ భార‌త్‌లో సోనీ ఆడియో డేస్ 2021 పేరిట ఓ ప్ర‌త్యేక సేల్‌ను నిర్వ‌హిస్తోంది. ఇందులో భాగంగా సెప్టెంబ‌ర్ 1 నుంచి 5వ తేదీ వ‌ర‌కు త‌మ కంపెనీకి చెందిన ఆడియో ఉత్ప‌త్తుల‌ను సోనీ భారీ త‌గ్గింపు ధ‌ర‌ల‌కు అందిస్తోంది. సోనీ హెడ్ ఫోన్స్ బ్లూటూత్ స్పీక‌ర్లు, పార్టీ స్పీక‌ర్లు, హోమ్ ఆడియో సిస్ట‌మ్‌ల‌ను త‌గ్గింపు ధ‌ర‌ల‌కు అందిస్తోంది.

సోనీ డబ్ల్యూఎఫ్‌-హెచ్‌800 వైర్‌లెస్ ఇయ‌ర్ ఫోన్స్ ధ‌ర రూ.18,990 ఉండ‌గా ఈ సేల్‌లో ఆ ఇయ‌ర్ ఫోన్స్‌ను రూ.6,990కే కొనుగోలు చేయ‌వచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఇయ‌ర్ ఫోన్స్ ల‌భిస్తున్నాయి. అలాగే అనేక ఇత‌ర ఆడియో ప్రొట‌క్ట్స్‌ను భారీ త‌గ్గింపు ధ‌ర‌ల‌కు వినియోగ‌దారులు కొనుగోలు చేయ‌వ‌చ్చు.

దేశ‌వ్యాప్తంగా ఉన్న అన్ని సోనీ రిటెయిల్ స్టోర్స్, షాప్ ఎట్ ఎస్సీ పోర్ట‌ల్‌, ఈ-కామ‌ర్స్ సైట్ల‌లో ఈ ఆఫ‌ర్ల‌ను అందిస్తున్నారు. సోనీకి చెందిన డ‌బ్ల్యూహెచ్‌-1000ఎక్స్ఎం4 హెడ్ ఫోన్స్ ను రూ.5వేల డిస్కౌంట్ తో కొన‌వ‌చ్చు. అలాగే ఇంకో మోడ‌ల్‌పై రూ.12వేలు, మ‌రో మోడ‌ల్‌పై రూ.12వేల డిస్కౌంట్‌ను పొంద‌వ‌చ్చు.

సోనీకి చెందిన వైర్‌లెస్ ఇయ‌ర్ ఫోన్స్‌తోపాటు నెక్ బ్యాండ్స్‌, పార్టీ స్పీక‌ర్లు, ఇత‌ర ఆడియో ఉత్ప‌త్తుల‌ను త‌గ్గింపు ధ‌ర‌ల‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు.