TCS సీఈవోగా రాజేశ్‌ గోపీనాథ్‌ రాజీనామా

దేశీయ ఐటీసేవల సంస్థ TCS సీఈవో పదవికి రాజేశ్ గోపీనాథ్‌ రాజీనామా చేశారు. దాదాపు రెండు దశాబ్ధాల పాటు సేవలందించిన ఆయన తాజాగా తన ఉద్యోగానికి స్వస్తి పలికారు. కంపెనీ ఆయన స్థానంలో కే కృతివాసన్‌ను ఇంఛార్జి సీఈవోగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదేశాలు తక్షణం అమలులోకి వస్తాయని పేర్కొంది. ఈ మేరకు టాటా గ్రూప్‌నకు చెందిన కంపెనీ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.

గోపీనాథన్ టీసీఎస్‌లో దాదాపు 22 ఏళ్లపాటు సేవలందించారు. కంపెనీకి మేనేజింగ్‌ డైరెక్టర్‌గా, సీఈవో ఆరేళ్లు సేవలందించారు. అయితే, వచ్చే సెప్టెంబర్‌ వరకు కృతి వాసన్ టీసీఎస్ కంపెనీలో సేవలు అందించనున్నారు. ఆయన స్థానంలో కృతి వాసన్‌ సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆయన పూర్తిస్థాయి సీఈవోగా నియాకమకం కానున్నారు. కే కృతి వాసన్‌ ప్రస్తుతం కంపెనీలు బ్యాకింగ్‌, ఫైనాన్స్‌, ఇన్సూరెన్స్‌ వ్యాపార విభాగానికి అ ధ్యక్షుడు, గ్లోబల్‌ హెడ్‌గా ఉన్నారు.