సెన్సేషనల్ హిస్టరీ క్రియేట్ చేసిన ‘థ్రెడ్స్‌’.. వారంలోనే 10 కోట్ల డౌన్‌లోడ్స్

-

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా థ్రెడ్స్ గురించే చర్చ. ఇక థ్రెడ్స్ యాప్​పై వస్తున్న మీమ్స్​కు లెక్కే లేదు. ఇంతగా నెటిజన్ల నోట్లలో నానుతున్న థ్రెడ్స్ ఆరంభం నుంచి సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉంది. ఇక తాజాగా థ్రెడ్స్ మరో సంచలనం సృష్టించింది. అదేంటంటే..?

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ ట్విటర్‌కు పోటీగా మెటా రూపొందించిన ‘థ్రెడ్స్‌’ మరో హిస్టరీ క్రియేట్ చేసింది. థ్రెడ్స్ ప్రారంభించిన వారం రోజుల్లోనే ఎకంగా 10 కోట్ల (100 మిలియన్ యూజర్స్) డౌన్‌లోడ్స్ పూర్తి చేసుకున్నట్లు మెటా అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌ తెలిపారు.

ట్విటర్‌ను ఎలాన్‌మస్క్‌ కొనుగోలు చేసిన తర్వాత, రోజుకో కొత్త కండిషన్‌ తెస్తుండటంతో చికాకులో ఉన్న యూజర్లు.. ఇప్పుడు థ్రెడ్స్‌కు ఫిదా అవుతున్నారు. ట్విటర్​ను పడగొట్టడమే టార్గెట్​గా వచ్చిన థ్రెడ్స్​ను మెటా తెలివిగా ఇన్‌స్టాగ్రామ్‌తో లింకు పెట్టిన విషయం తెలిసిందే. ఇన్​స్టాలో ఇప్పటికే 200 కోట్లమంది యూజర్లు ఉన్నారు. వీరంతా థ్రెడ్స్‌ను వాడటం మొదలుపెడితే కొన్నిరోజుల్లోనే ట్విటర్​ను థ్రెడ్స్‌ అధిగమించడం ఖాయమని టెక్ నిపుణుల అంచనా.

Read more RELATED
Recommended to you

Latest news