రానున్న రోజుల్లో టీవి ధరలు బాగా పెరిగిపోనున్నాయి. స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలని అనుకునే వాళ్ళకి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. కొన్ని రోజుల్లో భారీగా పెరిగే ఛాన్స్ ఉందని నిపుణలు పేర్కొంటున్నారు. అయితే ఇప్పటి కంటే కూడా ఇవి ఏకంగా 30 శాతం పెరగొచ్చనే అంచనాలున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. టీవి ధరలు బాగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. దీనికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.. టీవీల తయారీ లో ఉపయోగించే విడి భాగాల ధరలు పెరిగిపోవడమే కారణం అని అంటున్నారు. సరఫరా అడ్డంకుల కారణంగా విడిభాగాల ధరలు పెరిగాయి. దీని మూలంగానే టీవీల ధరలు పెరగడానికి అవకాశముందని పరిశ్రమ నిపుణులు తెలియజేశారు.
అలానే ఓపెన్ సెల్ డిస్‌ప్లే ధరలు పెరుగుతూ వచ్చాయి. ఏది ఏమైనా ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ సరఫరా తగ్గడం, ముడి పదార్థాల ధరలు పెరిగి పోయాయి. ఈ కారణాల బట్టి చూస్తే ఓపెన్ సెల్ డిస్‌ప్లే ధరలు పైకి చేరాయని నివేదికలు పేర్కొంటున్నాయి. వీటి వల్ల ఈ రేట్లు పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటె 32 అంగుళాల టీవీలకు సంబంధించిన ప్యానెల్స్ ధర 33- 35 డాలర్ల నుంచి 60 65 డాలర్లకు పెరిగాయని ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ IDC అసోసియేట్ మేనేజర్ జైపాల్ సింఘ్ తెలిపారు.
షావోమి, శాంసంగ్, వన్ ప్లస్ కంపెనీలు ఇప్పటికే టీవీల ధరలను 10 నుంచి 15 శాతం వరకు పెంచేశాయి. అలానే మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో టీవీల ధరలు 20 నుంచి 30 శాతం వరకు పెరగొచ్చని దైవా సీఈవో, ఫౌండర్ అర్జున్ బజాజ్ అన్నారు. అమెరికా చైనా మధ్య నెలకొన్న వాణిజ్య ఉద్రిక్త పరిస్థితులు కూడా ధరల పై ప్రభావం కూడా పడొచ్చు అని నిపుణులు చెబుతున్నారు.