వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్.. మూడింటిలో ఏది సరైనదంటే

-

ప్రతినిత్యం ఉపయోగించే వాట్సాప్ పై యూజర్ల నుండి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దానికి కారణం ప్రైవసీ పాలసీని మార్చడమే. వాట్సాప్ లో ఉండే మన డేటాని ఫేస్ బుక్ తో కూడా పంచుకుంటాం అని ప్రైవసీ పాలసీని ఫేస్ బుక్ మార్చేసింది. ఈ నేపథ్యంలో యూజర్లందరూ వాట్సాప్ ని డిలీట్ చేస్తూ, ఇతర మెసెంజర్ యాప్ లయిన టెలిగ్రామ్, సిగ్నల్ వంటి వాటికి వెళ్తున్నారు. ప్రస్తుతం టెలిగ్రామ్, సిగ్నల్ యాప్ లకి డిమాండ్ బాగా పెరిగింది. మిలియన్లలో డౌన్లోడ్లు జరుగుతున్నాయి.

వాట్సాప్ ప్రైవసీ పాలసీలో మార్పుల కారణంగా సిగ్నల్ యాప్, టెలిగ్రామ్ లకి విపరీతంగా డౌన్లోడ్లు పెరిగాయి. కేవలం నాలుగు రోజుల్లో సిగ్నల్ యాప్ యూజర్లు 2.3మిలియన్ల మంది పెరిగారు. టెలిగ్రామ్ యూజర్లు 1.5మిలియన్లు పెరిగారు. ఇదే క్రమంలో వాట్సప్ డౌన్లోడ్లు 35శాతం పడిపోయాయి.

ఐతే ఈ మూడు మెసెంజర్ యాప్ లలో ఏది సురక్షితం అనేది చూస్తే,

వాట్సప్ లో ధర్డ్ పార్టీ బ్యాకప్ ఉంటుంది. టెలిగ్రామ్ లో బ్యాకప్ ఫెసిలిటీ ఉంటుంది. కానీ సీక్రెట్ ఛాటింగ్ బ్యాకప్ చేయలేము. సిగ్నల్ లో బ్యాకప్ ఉంటుంది. కానీ మనం ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా అవి ఆఫ్ లో ఉంటాయి.

వాట్సాప్ పూర్తిగా ఓపెన్ సోర్స్ కాదు. టెలిగ్రామ్ కూడా పూర్తిగా ఓపెన్ సోర్స్ కాదు. కానీ టెలిగ్రామ్ సర్వర్లు కీలని ఆపరేట్ చేస్తూ ఉంటాయి. సిగ్నల్ లో పూర్తిగా ఓపెన్ సోర్స్. ఇంకా ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ ఉంటుంది.

అడ్వర్టైజ్ మెంట్ల కోసం వ్యక్తిగత సమాచారం బయటకి పోతుంది. సిగ్నల్, టెలిగ్రామ్ ల లో సమాచారం బయటకి పోదు.

యూజర్ల డాటాని వాట్సాప్ వాడుకుంటుంది. ఫేస్ బుక్ తో సంబంధం ఉన్న కంపెనీలతో వాటిని షేర్ చేసుకుంటుంది మిగతా వాటిల్లో అలాంటి అసౌకర్యం ఉండదు. ఫోన్ నంబరు, లొకేషన్, స్టేటస్, ఎంతసేపు వాడుతున్నారన్న సమయం, ఫోన్ వివరాలతో సహా ఇతర డేటా కూడా వాట్సాప్ తీసుకుంటుంది. టెలిగ్రామ్ లో యూజర్ ఐడీ, ఫోన్ నంబరు, కాంటాక్టుల నంబర్లు తీసుకుంటుంది. సిగ్నల్ లో ఫోన్ నంబర్ తీసుకుని స్టోర్ చేసుకుంటుంది. కాంటాక్టుల నంబర్లు తీసుకుంటుంది.

ఐతే ప్రస్తుతం భారత ప్రభుత్వం వాట్సాప్ ప్రైవసీ పాలసీని పరిశీలిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news