గూగుల్ టీవీ మార్కెట్ లోకి వచ్చేసిందోచ్…ఫీచర్స్,ధర..

-

గూగుల్ టీవీ గురించి అందరికి తెలిసే ఉంటుంది. అదే గూగుల్ క్రోమ్‌కాస్ట్. ఈ డివైజ్ త్వరలో ఇండియాలో లాంచ్ కాబోతోందోచ్.4K సపోర్ట్‌తో రానున్న ఈ క్రోమ్‌కాస్ట్ అధికారిక లాంచ్ తేదీని ఇంకా ప్రకటించలేదు కానీ Flipkart ఈ కొత్త ప్రొడక్ట్‌ను ధరతో పాటు తన వెబ్‌సైట్ లిస్టింగ్‌లో ఉంచడం విశేషం. త్వరలోనే ఈ టీవీ లాంచ్ కానున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే ఈ గూగుల్ క్రోమ్‌కాస్ట్ విత్ టీవీ 4Kని లిస్ట్‌ చేసి దీని ధరను రూ.6,399గా తెలిపింది Flipkart.ఈ 4K వెర్షన్‌ మంచు లాంటి తెలుపు రంగులో లాంచ్ కానుందని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది.

మామూలు ఒక ఈ కామర్స్ ఒక ప్రోడక్ట్ గురించి లిస్ట్ చేసిందంటే అది అతి త్వరలో లాంచ్ కానుందని అర్థం. కాగా, ఈ గూగుల్ క్రోమ్‌కాస్ట్ కూడా త్వరలోనే ఇండియన్ మార్కెట్లో ఎంట్రీ ఇవ్వొచ్చనే అంచనాలు వున్నాయి.ఇక ఈ గూగుల్ క్రోమ్‌కాస్ట్ విత్ TV అధికారికంగా కొన్నేళ్ల క్రితమే అందుబాటులోకి వచ్చింది.అయితే ఈ డివైజ్‌ ఇప్పటి వరకు భారత్‌లో లాంచ్ కాకపోవడం గమనార్హం..

గత నెలలో గూగుల్ క్రోమ్‌కాస్ట్ విత్ టీవీని భారత్‌తో సహా మరో 12 దేశాలలో లాంచ్ చేస్తామని కంపెనీ ఒక నివేదికలో పేర్కొన్న విషయం తెలిసినదే..ఈ గూగుల్ టీవీ అందరి అంచనాలకు తగిన విధంగా ఉండేలా ఇవ్వాలని యోచిస్తోంది.ఈ కారణంగానే ఈ డివైజ్ ఇంకా ఇండియాలో లాంచ్ కాలేదని గూగుల్ ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ టీవీ ఫీచర్స్ విషయానికొస్తే..

*. క్రోమ్‌కాస్ట్ ప్రతి సెకన్‌కు 60 ఫ్రేమ్‌ల చొప్పున 4K HDR క్వాలిటీ వీడియోలను అందిస్తుంది.

*. వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరచడానికి డాల్బీ విజన్‌ సపోర్ట్‌తో రాబోతోంది.
*. Netflix, యూట్యూబ్ కోసం డెడికేటెడ్ బటన్‌లతో క్రోమ్‌కాస్ట్ రిమోట్‌ రూపొందనుంది.
*. ఇందులో 8GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉంది.

ఎప్పుడు లాంచ్ అవుతుంది తెలియలేదు.కానీ త్వరలో మార్కెట్ లోకి రానుందని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news