గుంటూరులో జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశాలు విజయవంతం కాలేదని అన్నారు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు. ప్లీనరీకి 25 వేలకు మించి జనాలు రాలేదని అన్నారు. 56 కార్పోరేషన్లు, 10 మంత్రి పదవుల పేరుతో ప్లీనరీలో తీర్మానం పెట్టడం దారుణమన్నారు. కార్పొరేషన్లతో మూడేళ్లలో ఎంత ఖర్చు చేశారని ప్రశ్నించారు. ఎస్సీల అసైన్డ్ భూములు లాక్కున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను వైసిపి పార్టీ సభ్యుడిగా ప్లీనరీకి వెళ్ళాలి అనుకున్నాను కానీ ఆహ్వానం అందలేదన్నారు.
రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని అన్నారు. మన్యంలో చంద్రబాబు కాఫీ తోటలు పెంచితే జగన్ గంజాయి తోటలు పెంచారని ఎద్దేవా చేశారు.” మైనారిటీ సంక్షేమం నిధులు రూ.1,483 కోట్లు దారి మళ్లింపు వాస్తవమా కాదా? దుల్హర్, రంజాన్ తోఫా, దుకాణ్ మకాణ్ ఎందుకు ఆగాయి..? ఇస్లామిక్ బ్యాంకు హామీ పై మాట తప్పడం మైనార్టీ ద్రోహం కాదా జగన్ రెడ్డి. పదిమందికి పదవులు ఇచ్చి, వేల మందిని హత్య చేయడం, దళితులకు బోరుగులు పెట్టి.. వారి బంగారం కొట్టేయడం సామాజిక న్యాయమా”? అంటూ అచ్చెన్నాయుడు విమర్శించారు.