రియల్ మీ స్మార్ట్ టీవీ X విడుదల.. ధర, స్పెసిఫికేషన్స్ మొదలైన వివరాలు మీకోసం..!

-

మీరు మంచి స్మార్ట్ టీవీ ని కొనాలని అనుకుంటున్నారా..? అయితే కొత్త స్మార్ట్ టీవీ సిరీస్‌ను లాంచ్ చేసేందుకు రియల్‌మీ రెడీగా వుంది. రియల్‌మీ స్మార్ట్ టీవీ ఎక్స్ ఫుల్ హెచ్‌డీ టీవీ ని కంపెనీ లాంచ్ చేయనుంది. 43 ఇంచులు, 40 ఇంచుల డిస్‌ప్లే సైజ్‌ల్లో, ఫుల్ విజన్ బెజిల్‌లెస్ డిజైన్‌తో ఈ స్మార్ట్ టీవీలు రానున్నాయి.

 

మరి ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ టీవీలు ఇప్పటికే అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌ లో లిస్ట్ అయ్యాయి. దీనితో వివరాలు బయటకి వచ్చాయి. ఫుల్ హెచ్‌డీ ఎల్ఈడీ డిస్‌ప్లే, 24 వాట్ల సౌండ్ ఔట్‌పుట్ ఉండే నాలుగు స్పీకర్లతో ఈ టీవీలు రానున్నాయి. డిస్‌ప్లే హెచ్‌డీఆర్ 10 కంటెంట్‌కు సపోర్ట్ చేస్తుంది.

పిక్చర్ బ్రైట్‌నెస్, కలర్, క్లారిటీ, కాంట్రాస్ట్ బాగా ఉండాలని క్రోమా బూస్ట్ ఇంజిన్‌ను ఈ టీవీల్లో పొందుపరిచింది కంపెనీ. 40 ఇంచులు, 43 ఇంచుల డిస్‌ప్లే వేరియంట్లు అందుబాటులోకి వస్తాయి. 1920 x 1080 పిక్సెల్ రెజల్యూషన్‌ ఉండే Full HD LED డిస్‌ప్లేను ఈ స్మార్ట్ టీవీలు కలిగి ఉంటాయి. అలాగే ఫుల్ విజన్, బెజిల్‌లెస్ డిజైన్‌తో వస్తున్నాయి ఇవి.

స్క్రీన్ చుట్టూ అంచులు సైజ్ కేవలం 5.76mm మాత్రమే ఉంటుంది.ఈ టీవీకి డాల్బీ ఆడియో సపోర్ట్ వున్ననాలుగు స్పీకర్లు ఉంటాయి. ఇవి మొత్తంగా 24 వాట్ల సౌండ్ ఔట్‌పుట్‌ను ఇస్తాయి. 1జీబీ ర్యామ్, 8జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను ఈ టీవీలు కలిగి ఉంటాయి. ARM Cortex-A55 CPU ఉండే క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్‌ తో ఉంటుంది ఇది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ స్మార్ట్ టీవీలు పని చేస్తాయి. క్రోమ్‌‌కాస్ట్, గూగుల్ అసిస్టెంట్ ఫీచర్లు ఈ టీవీ కి వున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news