ఎక్స్‌60 సిరీస్‌లో 3 ఫ్లాగ్‌షిప్ ఫోన్ల‌ను విడుద‌ల చేసిన వివో.. ఫీచ‌ర్లు అదుర్స్‌..!

Join Our Community
follow manalokam on social media

మొబైల్స్ త‌యారీదారు వివో ఎక్స్‌60 సిరీస్‌లో మూడు నూత‌న ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ల‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఎక్స్‌60, ఎక్స్‌60 ప్రొ, ఎక్స్‌60 ప్రొ ప్లస్ పేరిట ఆ ఫోన్లు విడుద‌ల‌య్యాయి. వీటిల్లో అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

vivo launched x60 and x60 pro and x60 pro plus smart phones

వివో ఎక్స్‌60, ఎక్స్‌60 ప్రొ ఫీచ‌ర్లు

* 6.56 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ అమోలెడ్ డిస్‌ప్లే
* 2376×1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 870 ప్రాసెస‌ర్
* ఎక్స్‌60 – 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్
* ఎక్స్‌60 ప్రొ – 12జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌
* ఆండ్రాయిడ్ 11, డ్యుయ‌ల్ సిమ్
* 48, 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా
* ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, 5జి
* డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.1, యూఎస్‌బీ టైప్ సి
* 4300 ఎంఏహెచ్ బ్యాట‌రీ (ఎక్స్‌60), 4200 ఎంఏహెచ్ బ్యాట‌రీ (ఎక్స్‌60ప్రొ)
* 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్

వివో ఎక్స్‌60 ప్రొ ప్ల‌స్ ఫీచ‌ర్లు

* 6.56 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ అమోలెడ్ డిస్‌ప్లే
* 2376×1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్ డ్రాగ‌న్ 888 ప్రాసెస‌ర్
* 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 11, డ్యుయ‌ల్ సిమ్
* 50, 48, 32, 8 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా
* ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, 5జి, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ
* బ్లూటూత్ 5.1, యూఎస్‌బీ టైప్ సి, 4200 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్

వివో ఎక్స్‌60 ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.37,990 ఉండ‌గా, 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.41,990గా ఉంది. అలాగే ఎక్స్‌60 ప్రొకు చెందిన 12జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.49,990గా ఉంది. వీటిని ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్ స‌హా అన్ని ఆన్‌లైన్ స్టోర్లు, రిటెయిల్ స్టోర్స్‌ల‌లో విక్ర‌యిస్తున్నారు.

వివో ఎక్స్‌60 ప్రొ ప్ల‌స్ స్మార్ట్ ఫోన్ ధ‌ర రూ.69,990 ఉండ‌గా ఈ ఫోన్ కూడా అన్ని స్టోర్స్‌లో ల‌భిస్తోంది. ఈ మూడు ఫోన్ల‌పై ప‌లు లాంచింగ్ ఆఫ‌ర్ల‌ను కూడా అందిస్తున్నారు.

TOP STORIES

షాకింగ్‌.. ప్ర‌తి 10 ఫోన్ల‌లో 4 ఫోన్లు సైబ‌ర్ దాడుల‌కు అనుకూలం.. నివేదిక‌లో వెల్ల‌డి..!

క‌రోనా కార‌ణంగా గ‌తేడాదిలో చాలా మంది వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేశారు. ఇక ప్ర‌స్తుతం కోవిడ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నందున ఉద్యోగులు చాలా మంది ఇళ్ల...