వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ హ్యకవుతున్నాయి జాగ్రత్త…!

-

వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్… ఈ నాలుగు లేని ఫోన్ ఉంటుందా..? అసలు ఈ నాలుగు లేని మనిషి ఉన్నాడా…? ఎక్కడో ఒకరు మినహా దాదాపుగా అందరూ వీటిని ఏదోక సందర్భంలో వాడే వాళ్ళే. వ్యక్తిగత, వ్యాపార, ఉద్యోగ, ఇతరత్రా అవసరాలకు వీటిని ఎక్కువగా వాడుకుంటూ ఉంటారు. ఇక సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ పెరిగిన తర్వాత వీటి వాడకం ఎక్కువైంది. వ్యక్తిగత సమాచారం మొత్తం దీనిలోనే ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ సమాచారాన్ని ఇందులో భద్ర పరుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

అయితే ఇప్పుడు అవి అంత సురక్షితం కాదనే అనుమానాలు ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి. ఈ యాప్స్ అన్ని కూడా ప్రధాన౦గా అమెరికా కేంద్రంగా పని చేస్తున్నాయి. అమెరికాకు, చైనాకూ సంబంధాలు సరిగా లేవు. దీనితో చైనా ప్రపంచంలో ఎక్కువగా ఉపయోగించే అమెరికా ఉత్పత్తులను లక్ష్యంగా చేసుకుంది అనే ఆరోపణలు వినపడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అమెరికాకు సన్నిహితంగా ఉండే అన్ని దేశాలు కూడా వీటిని విరివిగా వాడుతున్నాయి. ఇప్పుడు వాటిని హ్యాక్ చేసే ప్రయత్నం జరుగుతుందని అంటున్నారు.

ఇప్పటికే వాట్సాప్ ఈ ఆరోపణలను ఎక్కువగా ఎదుర్కొంటుంది. భారత్ లో ప్రముఖులకు సంబంధించిన సమాచారాన్ని ఇజ్రాయెల్ సంస్థ దొంగాలించింది. ఇక చైనా కూడా ప్రముఖ హ్యాకర్లను రంగంలోకి దింపి అమెరికా ఆదాయ మార్గాల మీద దెబ్బ కొట్టాలని భావిస్తుంది. ఇప్పుడు ఈ యాప్స్ లో వైరస్ లేదా… ఇతర బగ్స్ ని థర్డ్ పార్టీ ద్వారా ప్రవేశ పెట్టె అవకాశం ఉందని అంటున్నారు. ఇంకా మరికొన్ని అమెరికా ఉత్పత్తులను చైనా టార్గెట్ చేసే ప్రమాదం ఉందనే వ్యాఖ్యలు కూడా ఎక్కువగా వినపడుతున్నాయి. భారత్ లో ఎక్కువగా వినియోగించే గూగుల్ పే ని టార్గెట్ చేసినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news