వాట్పాప్ యూజ‌ర్ల‌కు గుడ్ న్యూస్‌.. మ‌రో అద్భుత‌మైన ఫీచ‌ర్ వ‌చ్చేసింది..!

-

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను కొత్త పుంత‌లు తొక్కుతోంది. తమ యూజర్లను ఆకట్టకునేందుకు ఆకర్షణీయమైన అప్ డేట్స్ రిలీజ్ చేస్తోంది. తాజాగా, ఓ కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టింది. తన పోర్ట్ ఫోలియోలో కాల్ వెయిటింగ్ ఫీచర్ ను కూడా చేర్చింది. ఇప్పటివరకు వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా కాల్ చేస్తే, మొదటి కాల్ పూర్తయ్యేవరకు మధ్యలో కాల్ చేసింది ఎవరో తెలుసుకోవడం సాధ్యమయ్యేది కాదు.

కానీ కొత్త ఫీచర్ తో కాల్ మాట్లాడుతున్నప్పుడే మధ్యలో వచ్చే కాల్ ను అటెండ్ అయ్యే వీలుంటుంది. అంతేకాదు, అవతలి వ్యక్తి కాల్ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో కాల్ చేసిన వ్యక్తికి కాల్ వెయిటింగ్ సందేశం వస్తుంది. ఐఓఎస్ యూజర్లకు గత నెలలోనే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. తాజాగా ఆండ్రాయిడ్ వినియోగదారులకు కూడా ఈ కాల్ వెయిటింగ్ ఫీచర్ ను తీసుకువచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news