ఈ చిన్న ట్రిక్ తో ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ ఇన్ స్టాలోనే డౌన్ లోడ్ చేసుకోవచ్చు..!

-

ఇన్‌స్టాగ్రాం సోషల్ మీడియాను ఏలుతుందనే చెప్పాలి. స్మార్ట్ ఫోన్లలో ఇన్‌స్టాగ్రాం, వాట్సప్ లేకుండా ఉండవు కదా..అందరికి ఎకౌంట్స్ ఉన్నాయి. మంచి టైం పాస్ ఇచ్చేవాటిల్లో ఇన్‌స్టాగ్రాం ఒకటి. మనకు ఇన్‌స్టాగ్రాంలో బెస్ట్ టైం పాస్ అయ్యోది రీల్స్. టిక్ టాక్ తర్వాత జనాలు దీనికి బాగా దగ్గరయ్యారు. చాలా మందికి ఇవే టైంపాస్.అయితే మనం ఏదైనా రీల్ చూసినప్పుడు అది మనకు నచ్చితే డౌన్‌లోడ్ చేసుకోవాలనిపిస్తుంది. దీనికోసం అందరూ ఆ రీల్ లింక్ కాపీ చేసి నెట్ లో డౌన్ లోడ్ ఇన్‌స్టాగ్రాం రీల్స్ అని బ్రౌజ్ చేసి డౌన్ లోడ్ చేస్తుంటారం. మరికొందరైతే వీటికోసం స్పెషల్ గా యాప్స్ వేసుకుంటారు. దీని కోసం ప్రత్యేకమైన యాప్ కూడా అవసరం లేదు. ఇన్‌స్టాగ్రామ్ యాప్ నుంచే డైరెక్ట్‌గా ఈ రీల్‌ను మీ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎలానో ఇప్పుడు చూద్దాం.

ఇన్‌స్ట్రాగామ్‌ | Instagram
ఇన్‌స్ట్రాగామ్‌ | Instagram

ముందుగా ఇన్‌స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేయండి.
మీరు సేవ్ చేసుకోవాలి అనుకునే రీల్‌ను ప్లే చేయండి.
ఆ రీల్ ప్లే అవుతున్నప్పుడు స్క్రీన్ కుడివైపు కిందభాగంలో లైక్, కామెంట్, షేర్ ఐకాన్స్ కనిపిస్తాయి కదా…వాటిలో షేర్ ఐకాన్‌‌పై క్లిక్ చేయాలి.
వెంటనే మీకు చిన్న పాపప్ విండో ఓపెన్ అయ్యి, మీరు ఎవరికి షేర్ చేయాలనుకుంటున్నారో అడుగుతుంది.
అక్కడ మీరు పైన ఫస్ట్ కనిపించే ‘Add Reel to Your Story’పై క్లిక్ చేయండి.
అప్పుడు మీకు మీ స్టోరీ విండో ఓపెన్ అవుతుంది.
ఆ విండోలో పైన డౌన్‌లోడ్ బటన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే ఈ రీల్ మీ ఫోన్‌లో సేవ్ అయిపోతుందన్న మాట.

అయితే వీడియోని కొంచె స్ట్రెచ్ చేస్తే స్క్రీన్ అంతా వస్తుంది. దీనికి ప్రత్యేకమైన యాప్ కూడా అవసరం లేదు. కాబట్టి ఇక నుంచి మీరు ఏవైనా రీల్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఈ సింపుల్ ట్రిక్‌ను ఫాలో ఐపోండి అంతే.! ఈ విషయం మాకు ఎప్పుడో తెలుసు అనుకుంటారేమో..అందిరికి తెలిసి ఉండదు కదా..అందుకేనండి అందించాం:).

Read more RELATED
Recommended to you

Latest news