వోల్ఫ్‌ ఎయిర్‌ మాస్క్‌తో కరోనా ఖతం!

-

కరోనా నేపథ్యంలో ఎదురవుతున్న ఆగచాట్టు అన్నీ ఇన్నీ కావు. అది మనల్ని ఇప్పట్లో వదిలేలా లేదు కూడా. అందువల్ల పలు కంపెనీలు కూడా కరోనాని కట్టడి చేయడానికి కొత్త ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకువస్తున్నాయి. ఇంతకీ ఆ మాస్క్‌ వివరాలేంటో తెలుసుకుందాం.


గాలి ద్వారా వ్యాపిస్తున్న కరోనాను వ్యాప్తిని తగ్గించేందుకు కేరళకు చెందిన ఆల్‌ ఎబౌట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ వోల్ఫ్‌ ఎయిర్‌ మాస్క్‌ పేరుతో ఓ ఎలక్ట్రానిక్‌ వస్తువును తయారుచేసింది. ఇది అలప్పుజాలోని కేరళ స్టార్టప్‌ కంపెనీ. చూడ్డానికి ఇది గోడకు తగిలించే భారీ సీసీ కెమెరాలాగా ఉంటుంది. కానీ, దీని పనితీరు పూర్తి భిన్నం. ఇది గాలిలో కరోనాను చంపుతుందని కంపెనీ తెలిపింది. ఇందులో ప్రత్యేకమైన అయాన్‌ టెక్నాలజీని వాడారు. ఇలాంటి టెక్నాలజీ వాడటం దేశంలోనే ఇదే తొలిసారి అంటున్నారు. తిరువనంతపురంలోని రాజీవ్‌ గాంధీ సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీ (ఖఎఇఆ) ఇప్పటికే ఈ వస్తువును టెస్ట్‌ చేసినట్లు కంపెనీ వ్యవస్థాపకుడు శ్యామ్‌ కృషణ్‌ తెలిపారు. ఆర్‌జీసీబీని భారతవైద్య పరిశోధనా మండలి ఐసీఎంఆర్‌ గుర్తించింది. తద్వారా దీనికి గుర్తింపు ఉన్న టెస్టింగ్‌ ల్యాబ్‌గా పేరు ఉంది.

పనిచేసే విధానం

ఇది తనకు తాను స్టెరిలైజ్‌ చేసుకునే పరికరం. చుట్టూ 1000 చ.అ గాలిలో ఉన్న వైరస్‌ను 15 నిమిషాల్లో చంపుతుంది. 99 శాతం వైరస్‌ కచ్ఛితంగా చచ్చిపోతుంది. ఈ పరికరం నిరంతరం 60వేల గంటలు పనిచేస్తుంది. మొత్తం 9 ఏళ్లు దీని లైఫ్‌టైం. ఆఫీసులు, థియేటర్లు, ఆస్పత్రులు ఇళ్లలో దీన్ని అమర్చుకోవచ్చని కంపెనీ చెప్పింది. ఇది కరోనాని మాత్రమే కాదు… దాంతోపాటూ ఇతర బ్యాక్టీరియాను కూడా చంపే అద్భుతమైన పరికరమట. దీనికి మీరు ఈ వోల్ఫ్‌ మాస్క్‌ను గోడకు అమర్చిు ఆన్‌ చేస్తే 360 డిగ్రీల కోణంలో దానంతట అదే గాలిని క్లీన్‌ చేస్తుందట. ఇలా రోజంతా చేస్తూనే ఉంటుందట. ముఖ్యంగా ఇలాంటి పరికరం థియేటర్లలో ఉండటం ఎంతో ముఖ్యం. సినిమా హాల్లో ప్రేక్షకులు ఏ భయమూ లేకుండా ఆస్వాదించగలుగుతారు.

తయారీవిధానం

ఈ వోల్ఫ్‌ మాస్క్‌ను జర్మనీ టెక్నాలజీతో తయారుచేశారు. పరికరంలో లోపలి భాగాల్ని డెన్మార్క్‌ నుంచి తెప్పించారు. ప్రస్తుతం ఈ పరికరాన్ని ఆ¯Œ లైన్‌ ఈ కామర్స్‌ సైట్లలో అమ్ముతున్నారు. ఇండియామార్ట్‌లో కూడా ఈ వస్తువు ధరను రూ.29,500గా చూపిస్తున్నారు. కావాలనుకున్న వాళ్లు కొనుక్కోవచ్చని కంపెనీ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version