రూ.34,999కే షియోమీ కొత్త ల్యాప్‌టాప్‌.. ఫీచ‌ర్లు ఎలా ఉన్నాయంటే..?

షియోమీ సంస్థ ఎంఐ నోట్‌బుక్ 14 ఇ-లెర్నింగ్ ఎడిష‌న్‌ పేరిట ఓ నూత‌న ల్యాప్‌టాప్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. దీంట్లో 14 ఇంచుల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇంటెల్ కోర్ ఐ3 10వ జ‌న‌రేష‌న్ ప్రాసెస‌ర్‌ను ఇందులో ఇచ్చారు. 8జీబీ ర్యామ్ ల‌భిస్తుంది. 256జీబీ ఎస్ఎస్‌డీని ఇందులో అందిస్తున్నారు. ఎంఐ బ్యాండ్ వాడేవారు దాంతో ఈ ల్యాప్‌టాప్‌ను అన్‌లాక్ చేసుకోవ‌చ్చు. సింపుల్‌గా బ్యాండ్‌ను ల్యాప్‌టాప్ ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్తే చాలు, ల్యాప్‌టాప్ అన్‌లాక్ అవుతుంది.

అలాగే ఎంఐ స్మార్ట్ షేర్ ద్వారా ఆండ్రాయిడ్ ఫోన్ల నుంచి ఈ ల్యాప్‌టాప్‌కు డేటాను సుల‌భంగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవ‌చ్చు. దీంట్లో 46 వాట్ల బ్యాట‌రీని ఏర్పాటు చేశారు. దీనికి 65 వాట్ల చార్జ‌ర్‌ను అందిస్తున్నారు. అందువ‌ల్ల ఈ ల్యాప్‌టాప్ వేగంగా చార్జింగ్ అవుతుంది. కేవ‌లం 35 నిమిషాల వ్య‌వ‌ధిలోనే ఈ ల్యాప్‌టాప్ 0 నుంచి 50 శాతం వ‌ర‌కు చార్జింగ్ పూర్త‌వుతుంది.

ఎంఐ నోట్‌బుక్ 14 ఇ-లెర్నింగ్ ఎడిష‌న్ స్పెసిఫికేష‌న్లు…

* 14 ఇంచుల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
* 2.1 గిగాహెడ్జ్ ఇంటెల్ కోర్ ఐ3-10110యు ప్రాసెస‌ర్‌, ఇంటెల్ యూహెచ్‌డీ గ్రాఫిక్స్ 620
* 8జీబీ డీడీఆర్‌4 2666 మెగాహెడ్జ్ ర్యామ్‌, 256 జీబీ సాటా ఎస్ఎస్‌డీ
* విండోస్ 10 హోం ఎడిష‌న్, ఇన్‌బిల్ట్ హెచ్‌డీ వెబ్ క్యామ్
* డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, హెచ్‌డీఎంఐ
* 3.5ఎంఎం హెడ్‌ఫోన్‌, మైక్రోఫోన్ జాక్‌, డీటీఎస్ ఆడియో
* 46 వాట్ల బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్

ఎంఐ నోట్‌బుక్ 14 ఇ-లెర్నింగ్ ఎడిష‌న్ ల్యాప్‌టాప్ ధ‌ర రూ.36,999గా ఉంది. అయితే లాంచింగ్ కింద ఈ నెల 11వ తేదీ వ‌ర‌కు రూ.2వేల డిస్కౌంట్ అందిస్తున్నారు. అందువ‌ల్ల ఈ ల్యాప్‌టాప్‌ను అప్ప‌టి వ‌ర‌కు రూ.34,999 ధ‌ర‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఇక హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ కార్డుల‌తో ఈ ల్యాప్‌టాప్‌పై అద‌నంగా మ‌రో 10 శాతం వ‌ర‌కు ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను పొంద‌వ‌చ్చు. దీంతో ధ‌ర మ‌రింత త‌గ్గుతుంది.