మీ జీమెయిల్ అకౌంట్ ఓపెన్ అవ్వడంలేదా..? అయితే ఇలా చెయ్యండి..!

-

చాలా మంది జీమెయిల్ ని ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మెయిల్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సులభంగా ఫైల్స్ వంటివి షేర్ చేసుకోవడానికి ఈమెయిల్ సౌకర్యంగా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా రెండు బిలియన్ జీమెయిల్ యూజర్లు ఉన్నారు. అయితే అనుకోకుండా ఒక్కొక్క సారి జీమెయిల్ లాక్ అవుతూ ఉంటుంది.

 

మళ్లీ జీమెయిల్ తో లాగిన్ చేస్తే కానీ సేవలు పొందడానికి అవ్వదు. పైగా జీమెయిల్ అకౌంట్ మనకి చాలా అవసరం. గూగుల్ ఫొటోస్, గూగుల్ మీట్ వంటి వాటికి కూడా జీమెయిల్ అవసరం అవుతుంది. అయితే కొన్ని కారణాల వల్ల జీమెయిల్ లాక్ అవ్వచ్చు. పాస్వర్డ్ మర్చిపోవడం, సెక్యూరిటీ వలన జీమెయిల్ అకౌంట్ బ్లాక్ అవుతూ ఉంటుంది.

ఒకవేళ కనుక మీ అకౌంట్ బ్లాక్ అయింది అంటే మీరు కంగారు పడకండి. తిరిగి మళ్ళీ మనం జీమెయిల్ లోకి లాగిన్ అవ్వొచ్చు. మీరు కనుక జీమెయిల్ పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గెట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేస్తే మళ్లీ గూగుల్ అకౌంట్ పాస్వర్డ్ మార్చుకోవచ్చు. టు స్టెప్ వెరిఫికేషన్ ఉన్నట్లయితే సెక్యూరిటీ ఉపయోగించచ్చు.

సెక్యూరిటీ లేకపోతే మరో డివైస్ తో మీరు మీ జీమెయిల్ లోకి లాగిన్ అయ్యేలా చూసుకోండి. మొబైల్ ఫోన్ లేదా టాబ్లెట్ కి నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు యాక్సెప్ట్ చేయండి. మీరు గూగుల్ ఆథెంటికేటర్ యాప్ వాడుతున్నట్టైతే అందులో వచ్చే సిక్స్ డిజిట్ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వొచ్చు. రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు వెరిఫికేషన్ కోడ్ పంపి వెరిఫై కూడా చేయొచ్చు. మీరు కనుక ముందే గూగుల్ అకౌంట్ బ్యాకప్ కోడ్స్ సేవ్ చేసినట్లయితే ఆ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వొచ్చు. ఇలా తిరిగి మళ్లీ మీరు మీ జీమెయిల్ ని పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news