గుప్పెడంతమనసు 303 ఎపిసోడ్: రిషీ దగ్గర మెల్లగా కూపీలాగే ప్రయత్నం చేస్తున్న మహేంద్ర..అసలు తడబడకుండా కవర్ చేస్తున్న ఇగోమాష్టర్

-

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో మహేంద్ర, ధరణీ దేవయాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వదిన ఏదైతే జరగొద్దు అని భయపడుతుందో అది జరిగే రోజు త్వరలోనే వస్తుంది అని నీకొక గుడ్ న్యూస్ చెప్పనా అని రిషీ వాళ్ల అమ్మ ఇంట్లో భజనం చేశాడంట అని చెప్తాడు. ధరణి సంతోషిస్తుంది. నేనొకసారి రిషీని చూసొస్తాను అని రిషీ రూంకు వెళ్తాడు. రిషీ అప్పటికే పడుకుని ఉంటాడు. బెడ్ షీట్ కప్పి, లవ్ యూ రిషీ అని చెప్పి వెళ్లిపోబోతాడు..రిషీ చేయి పట్టుకుంటాడు.ఏయ్ రిషీ నిద్రపోలేదా అంటే..వచ్చారు, నిద్రచెడగొట్టారు అంటాడు రిషీ. మహంద్ర నీతో మాట్లాడాలని వచ్చాను అంటాడు. ఇద్దరూ మాట్లాడుకుంటారు. మహేంద్ర నువ్వు ఎక్కడికి వెళ్లావో నాకు తెలుసు అంటాడు.

రిషీ ఎక్కడికి వెళ్లాను అంటే..జగతి ఇంట్లో భోజనం బాగుందా అంటే..ఆకలేసినప్పుడు ఏదైనా రుచిగానే ఉంటుంది అని మీకు కూడా తెలుసుకదా అంటాడు రిషీ. మహేంద్ర నవ్వుతాడు. ఇప్పుడు వసుధార వర్షంలో తడిచింది, తనకు ఎలా ఉందో చూడటానికి వెళ్లాను, ఆకలేసింది తిన్నాను, ఇందులో ఏముంది అంటాడు రిషీ. ఏముంది అంటే ఏం లేదు అంటాడు మహంద్ర. రిషీ మనసులో ఈ వసుధారకు అస్సలు బుద్దిలేదు, అన్నీ చెప్పేయ్యాలా అనుకుంటాడు. మహేంద్ర ఇప్పుడు వసుధార వర్షంలో తడిస్తే తీసుకెళ్లావుకదా..ఇలా ఎంతమందిని తీసుకెళ్తావ్ రిషీ అంటే..ఎంతమందిని అయినా అంటాడు రిషీ. గుడ్ జాబ్ రిషీ..ఇలా రెండుచేతులతో తీసుకెళ్తావు అనమాట అంటాడు మహేంద్ర. ఇలా వీళ్లిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. రిషీ ఫోను చూసి మహేంద్ర తీసుకుని ఈ పొగరు అంటాడు. రిషీ వెంటనే ఫోను తీసుకుని పొగరేంటి డాడ్ అంటే..ఏం లేదు రిషీ..ఓ సర్వే ప్రకారం..నగర పౌరుల్లో పొగరుశాతం పెరిగిందట అంటాడు. డాడ్ కి పొగరు గురించి తెలిసిందా అనుకుని గుడ్ నైట్ డాడ్ అంటాడు. ఈ సీన్ భలేగా ఉంటుంది.

రిషీ వసుధార నీ పరిచయమే ఓ జ్ఞాపకం అనుకుని..వసుధారతే ఉన్న మెమోరీస్ ని తలుచుకుని ఈ పొగరు ఏం చేస్తుంటుంది ఇప్పుడు అనుకుని మెసేజ్ చేస్తుంది. వసూ అప్పటికే చదువుకుంటుంది. చదువుకుంటున్నాను సార్ అని రిప్లైయ్ ఇస్తుంది. గుడ్ బాగా చదువుకో గుడ్ నైట్ అని మెసేజ్ చేస్తాడు రిషీ. ఈ మాత్రం చెప్పడానికి మెసేజ్ చేయటం ఎందుకో అనుకుంటుంది.

తెల్లారుతుంది. వసూ హడావిడిగా కాలేజ్ లోకి వస్తుంది. మీటింగ్ హాల్ లో ఫణీంద్ర జగతి చేత ఎగ్జామ్ కోరియర్ ను ఓపెన్ చేయిస్తాడు. ఇంకోవైపు వసుధార చూసుకోకుండా పిల్లర్ ను తగలబోతుంది. సరిగ్గా అదేటైంకి వచ్చి రిషీ లాగుతాడు. ఏంటి ఎగ్జామ్ మొదలవక ముందే నీకు టెన్షన్ మొదలైందా అంటే..అలాంటిదేం లేదు సార్ అంటుంది వసూ. ఏంటి బాగా ప్రీపేర్ అయ్యావా అంటే..అయ్యాను అంటుంది వసూ. తమరి కళ్లు చూస్తేనే అర్థమవుతుంది, మీతో ఇదే ప్రాబ్లమ్ ఎగ్జామ్ ముందు రోజు చదువుతారేంటో అని రిషీ కాస్త మోటివేట్ చేస్తాడు. ఫైనల్ గా పెన్ను ఇస్తాడు రిషీ. వసూ నేను ఇంటినుంచి పెన్ను తెచ్చుకున్నాను సార్ అంటుంది. నువ్వు పెన్ను తెచ్చుకోలేదనో, కొనుక్కోలేదనో ఇవ్వలేదు, సరే నీకు ఈ పెన్ను వద్దకపోతేలే అంటాడు. వసూ చేతిలోని పెన్ను తీసుకుని స్మైల్ ఇచ్చి వెళ్తుంది.

ఎగ్జామ్ స్టాట్ అవుతుంది. వసూ రాస్తూ ఉంటుంది. ఫణీంద్ర అంతా ఓకేనా అంటే..క్వశ్చన్ పేప్స్ డిస్ట్రిబ్యూట్ అయ్యాయి, అన్నీ ఓకే అని చెప్తుంది. రిషీ వసూ ఎగ్జామ్ రాస్తున్న రూంలోకి వచ్చి చూస్తాడు. అలా అలా ఎగ్జామ్ రాస్తారు. టైం అవుుతంది. పేపర్స్ ఇస్తారు. రిషీ కారులో వసూకోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. వసూ పుష్పాతో నవ్వుకుంటూ వస్తుంది. మొఖం చూస్తే ఎగ్జామ్ బాగా రాసినట్లు ఉంది అనుకుని కారు హారన్ కొడతాడు. వసూకి అర్థమవుతుంది. పుష్పా నువ్వెళ్లు రిషీ సార్ నన్ను పిలుస్తున్నారు అంటుంది. నేను నీ పక్కనే ఉన్నాను కదా నాకు తెలియకుండా నిన్ను ఎప్పుడు పిలిచారు అంటే..అవి అన్నీ నీకు అర్థంకావులే అని రిషీ కారు దగ్గరకు వెళ్తుంది. రిషీ డోర్ తీస్తాడు.వసూ కుర్చుంటుంది. ఎగ్జామ్ ఎలా రాశావు అంటే..బాగా రాశాను అని చెప్తుంది వసూ. సీట్ బెల్ట్ పెట్టుకోమంటాడు రిషీ. వసూకి అర్థంకాదు..ఎక్కడికి వెళ్తున్నామా అని.. సరే సీట్ బెల్ట్ పెట్టుకుంటుంది. అలా ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news